“సుజన ఫౌండేషన్” ఉచిత వైద్య శిబిరం విజయవంతం..

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎం ఎల్ ఏ సుజన చౌదరి ఆధ్వర్యంలోని “సుజన ఫౌండేషన్ ” ద్వారా 35 వ డివిజన్ , పూర్ణానందంపేట , కౌతా సుబ్బారావు మున్సిపల్ స్కూల్లో శనివారం నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతమైంది. “సుజన ఫౌండేషన్” ద్వారా అనుభవజ్ఞులైన వైద్యులతో నిర్వహించిన ఈ శిబిరంలో బీపీ ,షుగర్ , డెంటల్, కంటి పరీక్షలు, ఈ సీ జీ , 2 డి ఎకో, వంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను కూడా పంపిణీ చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగిన ఈ శిబిరంలో సుమారు 100 మందికి నిపుణులైన వైద్యుల బృందం ప్రత్యేక శ్రద్ధతో చికిత్సలు అందించారు. దీనివల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు పెద్ద ఉపశమనం లభించింది.

ప్రజారోగ్యమే లక్ష్యంగా ఎం ఎల్ ఏ సుజన చౌదరి ఆదేశాలతో “సుజన ఫౌండేషన్ ” ద్వారా వారాంతంలో నిర్వహిస్తున్న ఈ మెగా వైద్య శిబిరాలను పేద మధ్య తరగతి ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కూటమి నేతలు ప్రదీప్ కుమార్ రాజ్, భూదాల నంద కుమారి , పైడి మాల సుభాషిణి కోరారు.

పీ వీ ఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు, శంకర నేత్ర చికిత్సలయం వైద్యులు, గవర్నమెంట్ ఆస్పత్రి డెంటల్ డాక్టర్లు, సుజన ఫౌండేషన్ సిబ్బంది, సుజన మిత్రా కోఆర్డినేటర్లు ఈ శిబిరంలో తమ సేవలు అందించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మత్స్యకారుల సేవలో మరో కీలక నిర్ణయం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2026–27 సంవత్సరానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *