-ప్రజా దర్బార్ లో ప్రజల నుంచి నేరుగా అర్జీలు తీసుకున్న మైనారిటీ శాఖ మంత్రి ఎన్ ఎం డి ఫరూక్
-అర్జీదారుల సమస్యల పరిష్కారానికి నిబద్ధతతో పనిచేయండి – మైనారిటీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరుక్
-ఎంపీ కేశినేని చిన్ని ఆదేశాల మేరకు రాష్ట్ర మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి ఫతావుల్లా ఆధ్వర్యంలో ప్రజాదర్బార్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లో విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని ఆదేశాల మేరకు రాష్ట్ర మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి ఫతావుల్లా ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర మైనారిటీ శాఖ మంత్రి ఎం ఎం డి ఫరూక్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రజల నుంచి నేరుగా స్వీకరించారు.ప్రజల సమస్యకు అధికారులు పరిష్కారం చూపినప్పుడు వారి ముఖంలో ఆనందం మన కృషికి దక్కిన ఫలితమని.. ప్రజా స్నేహ పూర్వక ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే అర్జీలకు గడువులోగా నాణ్యమైన పరిష్కారాన్ని చూపేందుకు అధికారులు కృషిచేయాలని మైనారిటీ శాఖ మంత్రి ఎన్ ఎండి ఫరూక్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఫారుక్ ప్రజల నుంచి నేరుగా అర్జీలు తీసుకోవడం వారి సమస్యలు విని త్వరితగతిన సమస్యలన్నిటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు తెలియజేశారు. గత వైసిపి హయాంలో జరిగిన భూకబ్జాలు అనేక రకాల కేసులు మరియు వివిధ రకాల అంశాలపై అనే కార్జీలు వచ్చినట్లు తెలిపారు. ప్రతి నియోజకవర్గంలోనూ ప్రజా దర్బార్ లాంటి ప్రజా సమస్యలు తెలుసుకునే కార్యక్రమం జరగాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ ప్రజా దర్బార్ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి ప్రతి సమస్యకు పరిష్కారం వచ్చే విధంగా కృషి చెయ్యాలి అని ఆదేశించినట్లు తెలిపారు. ముఖ్యoగా రెవెన్యూకు సంబంధించిపోలీసు శాఖకు సంబంధించి పురపాలక పట్టణాభివృద్ధికి సంబంధించి అర్జీలు వచ్చాయి ఈ అర్జీలపై ప్రత్యేకంగా దృష్టిసారించి నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలని మంత్రి ఆదేశించారు
ఈ కార్యక్రమం లో పశ్చిమ నియోజవర్గం పరిశీలకులు వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లె ఈశ్వర,తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి షేక్ ఆషా, మార్కెట్ యార్డ్ వైస్ ప్రెసిడెంట్ పాల మాధవ్,తెలుగు యువత అధ్యక్షులు మాధవ్, మైనారిటీ సెల్ నాయకులు ఎండీ ఆన్సర్,సయ్యద్ అలీ, షేక్ హబీబ్,తెలుగుమహిళాలు నసీమ,పితాని క్లస్టర్ ఇంచార్జ్ ధనేకుల సుబ్బారావు, క్లస్టర్ ఇంచార్జ్ సయ్యద్ కరీముల్లా, కో-క్లస్టర్ రమేష్ నాయక్,డివిజన్ అధ్యక్షులు జహీద్,విజయలక్ష్మి,కుంచం దుర్గారావు,పద్మ,దుర్గా,మల్లీశ్వరి,ప్రభుచరణ్,స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News