విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడలోని పి.బి. సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల బిజినెస్ ఎనలటిక్స్ విభాగం హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ స్కిల్లింగ్ సంస్థ ఫిక్సిటి ఇ.డి.ఎక్స్. ప్రైవేట్ లిమిటెడ్ తో శనివారం పరస్పర అవగాహన ఒప్పందం చేసుకున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ మేకా రమేష్ తెలిపారు. పరిశ్రమ అవసరాల మేరకు ఉపాధి లక్ష్యంగా విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించేందుకు ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ ఒప్పంద పత్రాలపై ప్రిన్సిపాల్ తో పాటు విభాగాధిపతి డా. బి. జయప్రకాష్, ఫిక్సిటి సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రాహుల్ వర్మ సంతకాలు చేశారు. క్యాంపస్ కో ఆర్డినేటర్ వహీదా రెహమాన్ కార్యక్రమం సమన్వయం చేశారు. డైరెక్టర్ వేమూరి బాబూరావు మాట్లాడుతూ
ఈ భాగస్వామ్యం ద్వారా విద్యార్థులకు పరిశ్రమ ఆధారిత శిక్షణ, ఇంటర్న్‌షిప్, ఉపాధికల్పన అందుబాటులోకి వచ్చి, పరిశ్రమకు అవసరమైన ఆధునిక నైపుణ్యాలను విద్యార్థులు సొంతం చేసుకునే అవకాశం కలుగుతుందన్నారు.
Prajavartha Online Telugu News