ఆయుర్వేదం భారతదేశం ప్రపంచానికి అందించిన అపూర్వ వైద్య సంపద… : డా. పసుపులేటి హరిప్రసాద్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి నగరంలోని రవీంద్ర నగర్, సమవాయి రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన SKD గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ – కనకాస్ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆసుపత్రిని ప్రారంభించారు.
ఈ సందర్భంగా డా. హరిప్రసాద్ మాట్లాడుతూ, “ఈరోజు నాకు ఎంతో ఆనందకరమైన రోజు. శ్రీ వేంకటేశ్వర స్వామివారి పవిత్ర పాదాల చెంత తిరుపతి నగరంలో ఇలాంటి అత్యాధునిక సదుపాయాలతో కూడిన మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేద ఆసుపత్రి ప్రారంభం కావడం ఎంతో శుభపరిణామం. ప్రజలకు నాణ్యమైన ఆయుర్వేద వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేసిన యాజమాన్యాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను” అని తెలిపారు.
ఆయుర్వేదం భారతదేశంలో పుట్టి ప్రపంచానికి అందిన అత్యంత ప్రాచీనమైన వైద్య విధానమని ఆయన పేర్కొన్నారు. వేలాది సంవత్సరాలుగా భారతీయుల ఆరోగ్య సంరక్షణలో ఆయుర్వేదం కీలక పాత్ర పోషించిందని, ప్రపంచంలోని ప్రతి దేశానికి వారి సొంత వైద్య విధానం ఉన్నట్లే, భారతదేశానికి ఆయుర్వేదం ఒక గొప్ప సాంస్కృతిక వారసత్వమని అన్నారు. యూరప్‌లో అల్లోపతి, జర్మనీలో హోమియోపతి ఎంత ప్రాచుర్యం పొందాయో, భారతదేశంలో ఆయుర్వేదం అంతటి విశిష్టతను కలిగి ఉందన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతీయ సాంప్రదాయ వైద్య విధానాలకు విశేష ప్రాధాన్యం లభిస్తోందని, దేశవ్యాప్తంగా ఆయుర్వేద వైద్య కళాశాలలు, పరిశోధనా కేంద్రాలు, ఆయుష్ సంస్థలు అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. భారతదేశపు వైద్య వారసత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పే దిశగా కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు.
తిరుపతిలోని టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆయుర్వేద వైద్య కళాశాల దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థల్లో ఒకటిగా నిలిచిందని, అక్కడ విద్యాభ్యాసం పూర్తి చేసిన యువ వైద్యులు నేడు ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించడం గర్వకారణమని పేర్కొన్నారు.
ఈ ఆసుపత్రి స్థాపకుల్లో ఒకరైన డా. కార్తీక్ టీటీడీ ఆయుర్వేద కళాశాలలో ఎండీ పూర్తి చేసి, ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ఈ ఆసుపత్రిని ప్రారంభించడం అభినందనీయమని కొనియాడారు. ఆయనతో పాటు డా. నికాంత్ (MD), డా. భువనేశ్వర్ (MS), డా. స్వాతి నీలిమ (MD), డా. తేజస్విని, డా. లహరి (కన్సల్టెంట్ పంచకర్మ ఫిజీషియన్), డా. ప్రభాబ్ (శల్య చికిత్స నిపుణులు), డా. కందుకూరి రామాంజనేయులు వంటి నిపుణులైన వైద్యులు ఒకే వేదికపై సేవలందించడం తిరుపతి ప్రజలకు ఎంతో ఉపయోగకరమని అన్నారు.
ఈ ఆసుపత్రిలో పంచకర్మ, క్షారసూత్రం, శల్య చికిత్స, ఫిషర్స్, ఫిస్టులా, పైల్స్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు అత్యాధునిక ఆయుర్వేద చికిత్సలు అందుబాటులో ఉండడం విశేషమన్నారు. పంచకర్మ చికిత్స ద్వారా అనేక దీర్ఘకాలిక వ్యాధులకు సమర్థవంతమైన చికిత్స అందించవచ్చని తెలిపారు.
యువ వైద్యుల ఈ బృందం సేవా దృక్పథంతో ముందుకు సాగి, రాబోయే రోజుల్లో ఈ ఆసుపత్రిని మరింత విస్తరించి, ఒక ప్రతిష్ఠాత్మక ఆయుర్వేద వైద్య కళాశాలను స్థాపించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
“వైద్యం అనేది కేవలం వృత్తి మాత్రమే కాదు, అది ఒక మహోన్నత సేవ. ధనార్జనతో పాటు సేవాభావం కూడా ప్రతి వైద్యునిలో ఉండాలి. ముఖ్యంగా పేద, బలహీన వర్గాలకు అందుబాటులో నాణ్యమైన వైద్య సేవలు అందించడం నిజమైన వైద్య ధర్మం. సమాజానికి సేవ చేయాలనే సంకల్పంతో పనిచేసే వైద్యులే ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలుస్తారు” అని డా. హరిప్రసాద్ పేర్కొన్నారు.
చివరగా SKD గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ యాజమాన్యానికి, డా. కార్తీక్ కి, వైద్య బృందంలోని సభ్యులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ఈ ఆసుపత్రి తిరుపతి ప్రజలకు విశ్వసనీయమైన ఆరోగ్య కేంద్రంగా ఎదిగి, రాష్ట్రంలోనే ఆదర్శప్రాయమైన ఆయుర్వేద వైద్య సంస్థగా నిలవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వైద్యులు, ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మత్స్యకారుల సేవలో మరో కీలక నిర్ణయం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2026–27 సంవత్సరానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *