-నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి…
-జిల్లా కలెక్టర్ శ్రీ డి.కె.బాలాజీ,ఐఏఎస్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను ది.15.07.2026 బుధవారం ఉదయం 09:00 గంటలకు అవనిగడ్డలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు “జాబ్ మేళా” నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ,ఐఏఎస్ తెలియజేశారు.
ఈ జాబ్ మేళాలో UNO మిందా లిమిటెడ్, టాటా ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, బంధన్ బ్యాంక్ లిమిటెడ్, ఎయు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్, ముక్కు ఫైనాన్సియల్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్, అడెక్కో, వరుణ్ మోటార్స్, క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ్ లిమిటెడ్, అపోలో ఫార్మసి, పేటిఎమ్ సర్వీసెస్ లిమిటెడ్ వంటి ప్రముఖ కంపెనీల వారు పాల్గొంటున్నారని, 690కు పైగా వివిధ ఉద్యోగాలకు సంబంధించి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి Dr. పి.నరేష్ కుమార్ గారు తెలిపారు.
ఈ కంపెనీలలో గల ఉద్యోగాలకు టెన్త్, ఇంటర్, ఐటిఐ, డిప్లొమా, డిగ్రీ, ఫార్మసి పూర్తిచేసిన 18 నుండి 35 సంవత్సరాల లోపు యువత అర్హులని, ఎంపిక అయిన వారికి మంచి వేతనము మరియు ఇతర సౌకర్యాలతో కూడిన ఉద్యోగ అవకాశాలు కలవని, జులై 15న నిర్వహించబోయే జాబ్ మేళాకు హాజరయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా సదరు ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.
ఆసక్తి మరియు తగిన అర్హతలు గల అభ్యర్థులు ముందుగా https://naipunyam.ap.gov.in వెబ్సైట్ నందు తప్పనిసరిగా తమ పూర్తి వివరాలతో రిజిస్టర్ కావడంతోపాటు, సదరు జాబ్ మేళాకు రెజ్యూమె లతో లేదా బయోడేటా ఫోరమ్ లతో పాటు ఆధార్, ఆధార్ కు లింక్ అయిన ఫోన్ నంబర్, PAN మరియు సర్టిఫికెట్ల జిరాక్సు కాపీలతో రావాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 63006 18985, 79955 34572 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.
Prajavartha Online Telugu News