విజయవాడ లో టికెట్ తెగితే విజయానికి టికెట్ తెగినట్టే… : ఎంపీ చిన్ని

-అన్ని ప్రాంతాలు హీరోలను అందిస్తే విజయవాడ సూపర్ స్టార్ లను ఇచ్చింది
-సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ నటించిన శ్రీనివాస మంగాపురం ట్రైలర్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కేశినేని చిన్ని

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ నటించిన ‘శ్రీనివాస మంగాపురం’ చిత్ర ట్రైలర్ విడుదల కార్యక్రమం విజయవాడ అప్సర థియేటర్లో ఘనంగా జరిగింది.

​ఈ వేడుకకు హీరోగా పరిచయమవుతున్న జయకృష్ణ, కథానాయిక రషా తడాని, చిత్ర దర్శకుడు అజయ్ భూపతి, ప్రముఖ నిర్మాత ఆదిశేషగిరిరావు, చిత్ర నిర్మాత జెమిని కిరణ్, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, బుద్ధ వెంకన్న తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అనంతరం విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ సూపర్ స్టార్ కృష్ణకు విజయవాడ నగరం అంటే ఎంతో ఇష్టమని ఆయన చిత్రాలు విజయవాడలో ఘనవిజయం సాధించాయని తెలిపారు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయ కృష్ణ శ్రీనివాస మంగాపురం చిత్రంతో హీరోగా తెలుగు ప్రేక్షకులకు దగ్గర కానున్నాడని ఈ చిత్రాన్ని ప్రేక్షకులు వీక్షించి విజయవంతం చేయాలని ఆయన కోరారు. అన్ని ప్రాంతాలు హీరోలను అందిస్తే విజయవాడ మాత్రం సూపర్ స్టార్ లను అందిస్తుందని కృష్ణ మహేష్ బాబులను సూపర్ స్టార్ గా మార్చిన విజయవాడ రేపు రాబోయే రోజుల్లో జై కృష్ణ అని కూడా సూపర్ స్టార్ గా చేస్తుంది అని తెలిపారు. ఏ సినిమా అయినా విజయవాడలో టికెట్ తెగితే విజయానికి టికెట్ తెగినట్టే అని ఎంపీ చిన్ని స్పష్టం చేశారు ఇప్పటికే సూపర్ స్టార్ గా మహేష్ బాబు అత్యద్భుతంగా సినిమా ఇండస్ట్రీలో రాణిస్తుంటే మరి మరో మహేష్ బాబును కూడా మనం జయకృష్ణ లో చూసుకుందామని తెలియజేశారు. అప్సర థియేటర్ లో విడుదలైన కృష్ణా సినిమాలన్న అద్భుత విజయాన్ని సాధించాలని అన్నారు. బెజవాడ అంటే సూపర్ స్టార్ కృష్ణకు ఎనలేని అభిమానమని తనను ఎప్పుడూ కలిసిన విజయవాడ ఎలా ఉంది అని ఆప్యాయంగా అడిగే వారిని అన్నారు ఘట్టమనేని కుటుంబంతో తనకు ఎప్పటినుండో మంచి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయని ఎంపీగా నేను విజయం సాధిస్తానని అనేకసార్లు ఆ కుటుంబ సభ్యులు ఆకాంక్షించాలని తెలియజేశారు మొదటి సినిమాకే ఈ విధమైన క్రేజ్ రావడంతో రాబోయే రోజుల్లో జయకృష్ణ మరిన్ని విజయాలు అందుకోవాలని తొలిగా ఈ సినిమా ఘనవిజయం సాధించాలని ఎంపీ చిన్ని ఆకాంక్షించారు

ఈ కార్యక్రమంలో సూపర్ స్టార్ కృష్ణ అభిమాన సంఘం ప్రతినిధులు సీరం బుజ్జి సుధా స్వామి తదితరులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మత్స్యకారుల సేవలో మరో కీలక నిర్ణయం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2026–27 సంవత్సరానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *