-ప్రారంభానికి సిద్ధమైన రాయనపాడు రైల్వే స్టేషన్
-ఎంపీ కేశినేని చిన్ని చొరవతో రాయనపాడు రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు పూర్తి
-అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రూ.35 కోట్లకు పైగా అభివృద్ధి పనులు
-విజయవాడ ప్రధాన స్టేషన్లో రద్దీని తగ్గించడానికి ప్రత్యామ్నాయ శాటిలైట్ టెర్మినల్ గా రాయనపాడు
-మౌలిక సదుపాయాలతో పాటు అత్యాధునిక హైటెక్ హంగులతో రూపుదిద్దుకున్న రాయనపాడు రైల్వే స్టేషన్
-కొండపల్లి బొమ్మల పెయింటింగ్స్ తో ప్రత్యేక ఆకర్షణ
-ఈనెల 17న ప్రారంభానికి ముహూర్తం ఖరారు
-అమృత్ భారత్ పథకం కింద దేశంలోని అన్ని రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే మోడీ ఉన్నారని స్పష్టం చేసిన ఎంపీ చిన్ని
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద చేపట్టిన రాయనపాడు రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని ప్రత్యేక చొరవ, నిరంతర పర్యవేక్షణతో స్టేషన్ అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తై, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలతో స్టేషన్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది.ఈ నెల 17వ తేదీన రాయనపాడు రైల్వే స్టేషన్‌ను లాంఛనంగా ప్రారంభించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.
రాయనపాడు రైల్వే స్టేషన్ ను అమృత్ భారత్ పథకం కింద రైల్వే శాఖ అభివృద్ధి చేసింది స్టేషన్లో కొత్త ప్లాట్ఫారంల నిర్మాణం ప్రయాణికుల వెయిటింగ్ హాల్స్ టికెట్ కౌంటర్ ప్రయాణికులకు త్రాగునీటి సౌకర్యం స్టేషన్ మాస్టర్ రూమ్ ప్లాట్‌ఫారంపై షెడ్ల నిర్మాణం చేశారు అలాగే రైల్వే స్టేషన్ ప్రాంగణంలో మొక్కలతో గ్రీనరీ కూడా ప్రత్యేక ఆకర్షణగా ఉంది రైల్వే స్టేషన్ చుట్టూ ప్రహరీ గోడ కూడా నిర్మించారు ఈ రైల్వే స్టేషన్ మీదుగా ప్రతిరోజు 12 రైళ్లు రాకపోకలు కొనసాగనన్నాయి అని అధికారులు తెలియజేశారు వీటిలో కొన్ని ఎక్స్‌ప్రెస్ రైలు కూడా ఈ స్టేషన్ లో ఆగనున్నాయి భవిష్యత్తులో రాయనపాడు రైల్వే స్టేషన్ కీలకంగా మారడంతో పాటు ప్రయాణికుల రద్దీ కూడా పెరిగే అవకాశం ఉంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేక శ్రద్ధతో భారతదేశంలో ఉన్న అన్ని రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ కింద అభివృద్ధి చేయాలని లక్ష్యంతో భారత రైల్వే శాఖ నిరంతరo కృషి చేస్తుంది
రాయనపాడు రైల్వే స్టేషన్ అభివృద్ధిలో భాగంగా మొత్తం పనుల భౌతిక, ఆర్థిక పురోగతి 100 శాతం పూర్తయింది. ప్రయాణికుల సౌకర్యాలు, భద్రత, ఆధునిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తూ పలు కీలక పనులు పూర్తి చేశారని ఎంపీ కేశినేని చిన్ని అన్నారు.
ఆధునిక వెయిటింగ్ హాల్, టాయిలెట్ సదుపాయాలు
రూ.5.77 కోట్ల వ్యయంతో ఆధునిక మాడ్యులర్ టాయిలెట్లు, ఏసీ ప్రీపెయిడ్ వెయిటింగ్ హాల్ నిర్మాణం పూర్తి చేశారు దివ్యాంగుల కోసం ప్రత్యేక మరుగుదొడ్లు ఏర్పాటు.
ప్రయాణికుల నిరీక్షణకు మెరుగైన సౌకర్యాలు కల్పన.
ప్లాట్‌ఫారమ్ అభివృద్ధి
రూ.13.33 కోట్లతో ప్లాట్‌ఫారమ్ ఉపరితల మెరుగుదల పనులు పూర్తిచేశారు 670 మీటర్ల పొడవు, 8 మీటర్ల వెడల్పుతో ఉన్న ప్లాట్‌ఫారమ్-1ను ఆధునీకరించారు.
దివ్యాంగుల సౌకర్యార్థం టాక్టైల్ పాత్ ఏర్పాటు చేశారు.
కొత్త ప్లాట్‌ఫారమ్ షెల్టర్ నిర్మాణం
రూ.6.38 కోట్ల వ్యయంతో ప్లాట్‌ఫారమ్-1పై 340 మీటర్ల పొడవైన కొత్త షెల్టర్ నిర్మాణం.
ప్రయాణికులకు ఎండ, వర్షాల నుంచి రక్షణ కల్పించేలా ఏర్పాటు చేశారు
రూ.5.77 కోట్ల వ్యయంతో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌పై రెండు ఆధునిక లిఫ్టులు ఏర్పాటు.
ప్లాట్‌ఫారమ్-1కు ఒక లిఫ్ట్, 2 మరియు 3వ ప్లాట్‌ఫారమ్‌లకు ఒక లిఫ్ట్ ఏర్పాటు చేశారు.
వృద్ధులు, దివ్యాంగులు, ప్రయాణికులకు మెరుగైన రాకపోకల సౌకర్యం కల్పించారు.
ఆధునిక సౌకర్యాలతో కొత్త రూపు సంతరించుకున్న స్టేషన్ స్టేషన్ భవనం ముఖభాగం, అంతర్గత భాగాల పునరుద్ధరణతో పాటు ఆధునిక లైటింగ్, కళాకృతులు, ర్యాంపులు, దివ్యాంగుల కోసం టాక్టైల్ టైల్స్ వంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు.ప్రస్తుతం స్టేషన్లో ఉన్న రెండు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌లు ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా అందుబాటులో ఉన్నాయి.
ప్రయాణికుల భద్రత, సౌకర్యాలకు ప్రత్యేక చర్యలు
ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద 483 మీటర్ల పొడవైన ప్రహరీ గోడ నిర్మాణం.కొత్త వెడల్పాటి ప్రవేశ, నిష్క్రమణ గేట్ల ఏర్పాటు.
192.93 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏసీ ప్రీపెయిడ్ వెయిటింగ్ హాల్.133.35 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఆధునిక మాడ్యులర్ టాయిలెట్ సముదాయం పరిసర ప్రాంతాల సమగ్ర అభివృద్ధి చేశారు
స్టేషన్ ప్రధాన ప్రవేశ ప్రాంతాన్ని ఆధునీకరించడంలో భాగంగా:
1,657 చదరపు మీటర్ల రాకపోకల ప్రాంతం అభివృద్ధి.
651 చదరపు మీటర్ల పార్కింగ్ స్థలం ఏర్పాటు.
పాదచారుల మార్గాలు, ల్యాండ్‌స్కేపింగ్, లేన్ మార్కింగ్, వీధి దీపాల ఏర్పాటు.
ఎంపీ కేశినేని చిన్ని కృషితో వేగవంతమైన అభివృద్ధి జరిగింది.రాయనపాడు రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తయ్యేందుకు ఎంపీ కేశినేని చిన్ని కేంద్ర రైల్వే శాఖ అధికారులతో సమన్వయం చేస్తూ ప్రత్యేక శ్రద్ధ చూపించారు. ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ అభివృద్ధి పనులు విజయవంతంగా పూర్తయ్యాయి.అమృత్ భారత్ స్టేషన్ పథకం ద్వారా ఆధునీకరించబడిన రాయనపాడు రైల్వే స్టేషన్ ఇకపై ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన, సురక్షితమైన ప్రయాణ అనుభూతిని అందించనుంది.
Prajavartha Online Telugu News