విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో ఘనంగా ‘రోటరీ శ్రీదుర్గ తపాడియా డయాగ్నస్టిక్ సెంటర్’ ప్రారంభమైంది. సోమవారం సూర్యారావుపేటలో ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇంటెలిజెన్స్ ఎడిజిపి మహేష్ చంద్ర లద్ధా ఐపీఎస్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… లాభాపేక్ష లేకుండా, కేవలం సేవా దృక్పథంతో సమాజంలోని సామాన్యులకు సైతం సరసమైన ధరలకే నాణ్యమైన వైద్య పరీక్షలను అందించడంలో ‘తపాడియా డయాగ్నస్టిక్’ యాజమాన్యం ఎంతో ప్రసిద్ధి చెందిందని కొనియాడారు. ఇటువంటి ఉత్తమమైన ప్రాజెక్ట్‌ను విజయవాడ ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన రోటరీ శ్రీదుర్గ క్లబ్ ప్రతినిధులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
రోటరీ శ్రీదుర్గ క్లబ్ అధ్యక్షుడు కె.వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ… క్లబ్ ద్వారా భవిష్యత్తులో చేపట్టబోయే మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాల వివరాలను సభకు వివరించారు. వక్తలు, విజయవాడలోని ఇతర రోటరీ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ…రోటరీ శ్రీదుర్గ క్లబ్ నాయకత్వం వహించి చేపట్టిన ఈ అద్భుతమైన ప్రాజెక్ట్‌ను ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో గౌరవ అతిధి డాక్టర్ రాధేశ్యామ్ తపాడియా, రోటరీ జిల్లా 3020 గవర్నర్ గుత్తికొండ శ్రీరామ్, పూర్వపు గవర్నర్ జి.వి.రామారావు, క్లబ్ సెక్రటరీ టి. నాగేశ్వర్, ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్ సురేన్ పోకూరి, గోలి రవీంద్ర మరియు క్లబ్ సభ్యులు, జీఆర్‌కే పోలవరపు సమితి అధ్యక్షులు గోళ్ళ నారాయణరావు, నగర ప్రముఖులు సుంకర నాగభూషణం తదితర నగర ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News