Breaking News

జర్నలిజంలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పడం అనే లక్ష్యం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
జర్నలిజంలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పడం అనే లక్ష్యంలో భాగంగా డిప్లొమా ఇన్ జర్నలిజం కోర్సును త్వరలో ప్రారంభిస్తున్నట్లు సి.ఆర్.మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేశ్ కుమార్ తెలిపారు. సి.ఆర్.మీడియా అకాడమీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ల సంయుక్త ఆధ్వర్యంలో ఈ కోర్సును నిర్వహిస్తున్నామన్నారు. ఈ అంశం పై చర్చించేందుకు గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొ. కె. గంగాధర రావు తో ఆయన చాంబర్ లోసి.ఆర్.మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేశ్ కుమార్ సోమవారం భేటీ అయ్యారు. జర్నలిస్టులుగా పనిచేస్తూ అందుకు సంబంధించిన వృత్తి పరమైన విద్య లేని వారికి ఈ డిప్లమో కోర్సు ద్వారా ప్రయోజనం చేకూరుస్తున్నామన్నారు. ఇందువల్ల వారి వృత్తిపరమైన నైపుణ్యాన్ని పెంపొందించుకో గలుగుతారన్నారు. ఇంటర్ పాస్ అయిన జర్నలిస్టులు, జర్నలిజం వృత్తిని చేపట్టాలన్న అభిరుచి కలిగిన డిగ్రీ పాస్ ఐన అభ్యర్థులు ఈ కోర్సు కు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని ఆయన పేర్కొన్నారు.

ఇందుకోసం ఇప్పటికే “బోర్డు ఆఫ్ స్టడీస్” ను ఏర్పాటు చేసి, ఈ కోర్సు కు సిలబస్ ను, పరీక్ష పత్రాల నమూనాను రూపొందించామన్నారు. జర్నలిస్టులు, ఇతర అభ్యర్థుల నుంచి దరఖాస్తు లు కోరుతూ నోటిఫికేషన్ ను ఈ నెలాఖరు లోపున విడుదలచేస్తామన్నారు. అభ్యర్థులకు సీనియర్ ఫాకల్టీ ద్వారా ప్రతి రోజూ ఆయా అంశాలపై ఆన్ లైన్ క్లాసులు నిర్వహించడం జరుగుతుందన్నారు.

ఈ సందర్భంగా నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొ. కె. గంగాధర రావు మాట్లాడుతూ తమ యూనివర్సిటీ ద్వారా డిప్లమా కోర్సు కు సంబంధించిన పరీక్షలు నిర్వహించడం, పరీక్ష పేపర్ల వాల్యుయేషన్, తుది ఫలితాలు వెల్లడించడం తో పాటు ఉత్తీర్ణత సాధించిన వారికి సర్టిఫికెట్లు అందచేస్తా మన్నారు. ఇందుకు యూనివర్సిటీ కాంపస్ కో ఆర్డినేటర్ గా జర్నలిజం డిపార్టుమెంట్ అధిపతి డా. కె. జ్యోతిర్మయి ని నామినేట్ చేశారు. ఈ సందర్భంగా సి.ఆర్.మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేశ్ కుమార్ ను వైస్ ఛాన్సలర్ సత్కరించారు.

ఈ సమావేశంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రో.జి.సింహాచలం, జర్నలిజం డిపార్టుమెంట్ అధిపతి డా. కె. జ్యోతిర్మయి, కంట్రోలర్ ఆఫ్ ఎక్సఆమినషన్స్ ఏ . వెంకటేశ్వర్లు, సి.ఆర్.మీడియా అకాడమీ సెక్రెటరీ టి.కస్తూరి, మేనేజర్ ఎం.భాస్కర్ నారాయణ, డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్ ఎం. లోవరాజు, చైర్మన్ పి .ఎస్.  ఎస్. శ్రీనివాస జీవన్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎన్.ఐ.డి. ప్రాంగణంలో 12వ జాతీయ చేనేత దినోత్సవ ముందస్తు వేడుకలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సమీపంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ప్రాంగణంలో 12వ జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *