– ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు జిల్లాలో ప్రత్యేక ఆధార్ సేవా శిబిరాలు అందుబాటులో ఉంటాయని.. ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.
ఎంపిక చేసిన స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాలతో పాటు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ఈ శిబిరాలు సేవలందిస్తాయన్నారు. కొత్తగా ఆధార్ నమోదు, ఆధార్‌లో పేరు, చిరునామా, జనన తేదీ, మొబైన్ నంబరు, బయోమెట్రిక్ వివరాల నవీకరణతో పాటు 5 నుంచి 15 ఏళ్లు, ఆ పైబడిన చిన్నారుల బయోమెట్రిక్ అప్‌డేట్ తదితర సేవలను పొందొచ్చన్నారు. ప్రజలకు సకాలంలో పారదర్శకంగా ఆధార్ సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రధానంగా విద్యార్థులకు ఆధార్ సేవలు తేలిగ్గా అందుబాటులో ఉండేలా పాఠశాలలు,
కళాశాలల్లోనూ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు.
Prajavartha Online Telugu News