తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి నగరంలోని శ్రీ వినాయక ఆర్‌ఎస్–3 ఆటో స్టాండ్, ఆర్‌ఎస్–2 ఆటో స్టాండ్, 1వ సత్రం ఆటో స్టాండ్, తిరుచానూరు పద్మావతి ఆటో స్టాండ్, తిరుచానూరు నాగాలమ్మ ఆటో స్టాండ్‌కు చెందిన ఆటో డ్రైవర్లను రామ్ గోపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (PAC) సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ వద్దకు తీసుకువచ్చి మర్యాదపూర్వకంగా కలిపారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లు తమ ప్రాంతాలకు సంబంధించిన పలు అంశాలను డా. హరిప్రసాద్ దృష్టికి తీసుకువచ్చారు. వారి సమస్యలను శ్రద్ధగా విన్న డా. హరిప్రసాద్, సంబంధిత అధికారులతో చర్చించి సాధ్యమైనంత త్వరగా పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
Prajavartha Online Telugu News