Breaking News

హవీష్ – త్రినాధరావు నక్కిన కాంబోలో ఫుల్ ఎంటర్‌టైనర్

-ఆకట్టుకుంటున్న ‘మెరుపులే ’ మెరుపులే సాంగ్..

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
యంగ్ హీరో హవీష్ కథానాయకుడిగా, హిట్ చిత్రాల దర్శకుడు త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ఓ ఫుల్ ఎంటర్‌టైనర్ తెరకెక్కుతోంది. సత్యనారాయణ కోనేరు సమర్పించు, నిఖిల కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రంలో హవీష్ సరసన కథానాయికగా కావ్య థాపర్ నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, ప్రమోషనల్ కంటెంట్‌తో ఈ సినిమా ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని పెంచుతోంది. తాజాగా ఈ మూవీ నుంచి రెండవ పాట ‘మెరుపులే’ మెరుపులే’ అంటూ సాగే గీతాన్ని చిత్ర బృందం, ప్రముఖ సినీ దర్శకుడు వి. వి. వినాయక్ చేతుల మీదుగా ‘మెరుపులే’ మెరుపులే అనే రెండవ పాటను స్థానిక కెఎల్ యూనివర్సిటీ లో అత్యంత ఘనంగా విడుదల చేశారు. ఫుల్ జోష్ తో యాత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్ గా రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటకు సంగీత ప్రియుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఆకట్టుకునే ట్యూన్‌తో పాటు అందమైన విజువల్స్, హీరోహీరోయిన్ల కెమిస్ట్రీ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
‘మెరుపులే’ మెరుపులే…
అంటూ సాగే లిరిక్స్ యూత్‌ను ఆకట్టుకునేలా ఉన్నాయి. లక్ష్యాన్ని సాధించే కొత్త అనుభూతులను అందమైన పదాలతో ఆవిష్కరించేలా ఈ పాటను రూపొందించారు. హవీష్‌ను సరికొత్త లుక్‌లో చూపిస్తూ దర్శకుడు త్రినాధరావు నక్కిన ఈ చిత్రాన్ని తనదైన ఎంటర్‌టైనింగ్ స్టైల్‌లో తెరకెక్కిస్తున్నారు. కామెడీ, రొమాన్స్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునే అంశాలు కూడా సినిమాలో ప్రధానంగా ఉండనున్నాయి.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ప్రముఖ దర్శకుడు వి. వి. వినాయక్,హీరో హవీష్ కోనేరు, కథానాయిక కావ్య థాపర్, చిత్ర దర్శకుడు త్రినాదరావు నక్కిన, కోనేరు సత్యనారాయణ, కోనేరు శివకాంచన లత, నిర్మాత నిఖిల కోనేరు, చిత్రబృందం పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎన్.ఐ.డి. ప్రాంగణంలో 12వ జాతీయ చేనేత దినోత్సవ ముందస్తు వేడుకలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సమీపంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ప్రాంగణంలో 12వ జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *