Breaking News

సొంత బిడ్డల్లా చూసుకోండి

-బీసీ సంక్షేమ శాఖాధికారులతో మంత్రి సవిత

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
వాతావరణంలో మార్పుల దృష్ట్యా బీసీ హాస్టళ్లు, గురుకులాల విద్యార్థుల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని బీసీ సంక్షేమ శాఖాధికారులను రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత ఆదేశించారు. వేడి చల్లార్చిన తాగునీటిని, తాజా ఆహారాన్ని మాత్రమే అందివ్వాలని ఆదేశించారు. స్వల్ప అస్వస్థత గురై గుంటూరు బీసీ హాస్టళ్లకు చెందిన ముగ్గురు విద్యార్థినులు కోలుకున్నా వారిని వైద్యులు ఎప్పటికప్పుడు పర్యేవేక్షిస్తుండాలని ఆదేశించారు. ఈ మేరకు మంత్రి సవిత…గుంటూరు జిల్లా బీసీ సంక్షేమశాఖాధికారులను, గుంటూరు ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ దుర్గాప్రసాద్ ను ఫోన్ లో దిశానిర్దేశం చేశారు. గుంటూరు నగరానికి చెందిన బీసీ హాస్టల్ విద్యార్థినులు ఐరన్ మాత్రలు వేసుకున్నారు. వారిలో ముగ్గురు విద్యార్థినులకు ఐరన్ ట్యాబెట్లు పడకపోవడంతో వాంతి వచ్చినట్లు, తల తిరిగినట్లు ఉండడంతో స్థానిక జీజీహెచ్ ఆసుపత్రికి బీసీ సంక్ష్క్షేమ శాఖాధికారులు తరలించారు. విషయం తెలుసుకున్నవెంటనే జీజీహెచ్ ఆసుపత్రి సూపరింటెండెంట్ దుర్గాప్రసాద్ తోనూ, జిల్లా బీసీ సంక్షేమ శాఖాధికారి మయూరి, ఇతర అధికారులతోనూ మంత్రి సవిత ఫోన్ లో మాట్లాడి, విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. విద్యార్థినులు కోలుకున్నారని, ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారని వారు మంత్రికి వివరించారు. ఫుడ్ పాయిజన్ కారణంగా విద్యార్థినులెవరూ అస్వస్థతకు గురికాలేదన్నారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, విద్యార్థినులు పూర్తిగా కోలుకునే వరకూ వైద్యుల పర్యవేక్షణలోనే ఉంచాలన్నారు. హాస్టల్ లో మిగిలిన విద్యార్థినుల గురించి అడిగి తెలుసుకుని, అవసరమైతే వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వాతావరణంలో వచ్చిన మార్పుల దృష్ట్యా మరింత అప్రమత్తంగా ఉండాలని బీసీ సంక్షేమశాధికారులకు మంత్రి సవిత దిశా నిర్దేశం చేశారు. విద్యార్థినులకు వేడి చేసి చల్లార్చిన తాగునీటిని, తాజా ఆహారాన్ని మాత్రమే అందించాలని, హాస్టల్ పరిసరాల్లో పరిశుభ్రత పాటించాలని స్పష్టంచేశారు. హాస్టల్ పరిసరాల్లో నీరు ఎక్కడ నిలబడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థుల ఆరోగ్యంపై అలక్ష్యం చూపితే, సహించేది లేదని, సొంత బిడ్డల్లా చూసుకోవాలని మంత్రి సవిత స్పష్టంచేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎన్.ఐ.డి. ప్రాంగణంలో 12వ జాతీయ చేనేత దినోత్సవ ముందస్తు వేడుకలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సమీపంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ప్రాంగణంలో 12వ జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *