Breaking News

రాజధాని అమరావతికి భూసమీకరణ కింద 5 ఎకరాల భూమిని అందజేసిన పెనుమాక రైతులు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజారాజధాని అమరావతి నిర్మాణానికి మేకా సాంబిరెడ్డి గారి కుటుంబసభ్యులు ల్యాండ్ పూలింగ్ పథకం కింద తమ భూములను స్వచ్ఛందంగా అందజేసేందుకు ముందుకొచ్చారు. పెనుమాక గ్రామ పరిధిలో తమ కుటుంబానికి చెందిన 5 ఎకరాల భూమిని రాజధాని నిర్మాణం కోసం APCRDA అధికారులకు అందజేసేందుకు తమ సమ్మతి తెలుపుతూ సంబంధిత అంగీకార పత్రాలను అడిషనల్ కమిషనర్ కొల్లాబత్తుల కార్తీక్ ఐఏఎస్ గారికి రాయపూడిలోని APCRDA ప్రధాన కార్యాలయంలో శుక్రవారం అందజేశారు. కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఏ.జి.చిన్నికృష్ణ పాల్గొన్నారు. రాజధాని అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యం అవుతున్నందుకు సంతోషంగా ఉందని మేకా సాంబిరెడ్డి గారు మరియు వారి కుటుంబసభ్యులు ఈ సందర్భంగా తెలియజేశారు. రాజధాని గ్రామాల ప్రజలు పూలింగ్ ప్రక్రియకు APCRDA అధికారులతో సహకరించాలని కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎన్.ఐ.డి. ప్రాంగణంలో 12వ జాతీయ చేనేత దినోత్సవ ముందస్తు వేడుకలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సమీపంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ప్రాంగణంలో 12వ జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *