Breaking News

విజయవాడలో ‘ఆంధ్రప్రదేశ్ మాజీ సైనికుల ఐక్య ప్రణాళిక సంఘం’ ముఖ్య సమావేశం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో ఆంధ్రప్రదేశ్ మాజీ సైనికుల ఐక్య ప్రణాళిక సంఘం ఆధ్వర్యంలో మాజీ సైనికుల ముఖ్య సమావేశం నిర్వహించబడింది. బుధవారం బందర్ రోడ్ లోని హైరా హోటల్‌లో ఆంధ్రప్రదేశ్ మాజీ సైనికుల ఐక్య ప్రణాళిక సంఘం, కో ఆర్డినేటర్ మోటూరి శంకర్ రావు నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలోని మాజీ సైనికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై సుదీర్ఘంగా చర్చించారు.
సమావేశంలో పలు ముఖ్య నిర్ణయాలు తీసుకున్నారు. అవి… రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉన్న మాజీ సైనికుల సంఘాలన్నింటినీ జిల్లా వారీగా ఒకే వేదికపైకి (ఏకతాటిపైకి) తీసుకురావడం జరిగింది. ప్రభుత్వ దృష్టికి సమస్యలు ప్రాంతాల వారీగా మాజీ సైనికులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను క్రోడీకరించి, వాటి పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం. మాజీ సైనికుల హక్కులు, సంక్షేమం కోసం త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా “మాజీ సైనికుల ఐక్యతా యాత్ర” నిర్వహించాలని సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు.
ఈ కార్యక్రమంలో కల్నల్ రాంబాబు, గోవిందరావు, జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) చైర్మన్ నాగరాజు, వెంకటప్పారావులతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రతినిధులు, మాజీ సైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *