Breaking News

రాజశేఖర్రెడ్డి మైనారిటీలకు 4.రిజర్వేషన్ ప్రదాత… : బాజీ బాబా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 55 డివిజన్ నైజాం గెట్ సెంటర్లో ఘనంగా రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకల్లో రాష్ట్ర వైఎస్ఆర్సీపీ కార్యదర్శి మైనారిటీ బాజీ బాబా పాల్గొన్నారు. రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి నివాళులర్పించి పేదలకు పళ్ళు పంపిణీ చేశారు. బాజీ బాబా మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి స్ఫూర్తిగా వారి తనయుడు జగన్మోహన్ రెడ్డి పాలన సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళు భావించే వారని తెలియజేశారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ రావు పశ్చిమ నియోజకవర్గానికి వందలాది కోట్ల రూపాయలు అభివృద్ధికి ఖర్చుపెట్టిన ఘనత దక్కిందన్నారు.
రాజశేఖర్ రెడ్డి పేదలకు ఆరోగ్యశ్రీ 108 104 గుండె ఆపరేషన్లు ఉచితంగా చేసేవారు పేదలకు కిలో రెండు రూపాయలు బియ్యం ఇచ్చేవారు చదువుకోవటానికి ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చారు పేదలకు రాజీవ్ గృహ కల్పన జి ప్లస్ త్రీ ఇల్లు సమకూర్చారు విదేశీ విద్య అమలుపరిచారు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అమలుపరిచారు. పేదప్రజలకు 200 రూపాయల పెన్షన్ అమలుపరిచారు ఉమ్మడి రాష్ట్రంలో 42 జలయజ్ఞం ప్రాజెక్టులను శంకుస్థాపన చేశారు ముఖ్యంగా మైనారిటీలకు ఫోర్ పర్సన్ రిజర్వేషన్ అమలుపరిచి చిరస్థాయిగా మైనారిటీల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చినారు మహిళలకు పావలా వడ్డీ రుణాలు ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ మైనార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రుద్రపాటి తేజ్ కుమార్ బీసీ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ గొలగాని శ్రీనివాసరావు రాష్ట్ర మున్సిపల్ వింగ్ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మహిళా సెక్రటరీ నాగ పావని రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ డేరంగుల వెంకటరమణ రాష్ట్ర ఎస్సీ సెక్రెటరీ కుంభ నాగేశ్వరరావు పశ్చిమ నియోజకవర్గ క్రిస్టియన్ మైనారిటీ అధ్యక్షుడు బత్తుల పాండు పశ్చిమ యువజన అధ్యక్షుడు రాజా జిల్లా యాక్టివ్.కార్యదర్శిమజ్జిశ్రీనివాసరావు క్లస్టర్ ఇంచార్జ్.వాసా బాబు వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు ముక్క రమణ క్షత్రియ సేవా సంఘం అధ్యక్షుడు రాజు రమేష్ కాపు నాయకుడు కర్రీ గౌరీ జిల్లా మైనారిటీ ఉపాధ్యక్షుడు ఈ న్యూస్ జిల్లా సెక్రెటరీ అహ్మద్ జిల్లా మైనార్టీ సెక్రటరీ అబ్దుల్ గని నజీరుద్దీన్ 54వ డివిజన్ బిఎల్ఎ అలీ 55వ డివిజన్ ఎస్సీ అధ్యక్షుడు పల్లె బాబు మైనారిటీ నాయకులు ఖాదర్బాషా అబ్దుల్ సత్తార్ మనికి బాబురావు తదితర నాయకులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *