-రెవెన్యూ ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రి అనగాని
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం త్వరలో ఉద్యోగ సంఘ నేతలతో సమావేశం ఏర్పాటు చేస్తానని రాష్ట్ర రెవెన్యూ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో రెవిన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ని అమరావతి రెవెన్యూ ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ భూపతిరాజు రవీంద్ర రాజు, రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు రాటకొండ శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షులు మిరియాల లక్ష్మీనారాయణ కలిసి తమ వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా రవీంద్రరాజు రెవిన్యూ మంత్రి కి ఉద్యోగుల సమస్యలను వివరించారు. ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న రెవిన్యూ ఉద్యోగుల సమస్యలపై వెంటనే చర్చించి సమస్యలు పరిష్కరించాలని కోరారు. వీఆర్ఏ, విఆర్ఓ, సర్వేర్లు, రెవెన్యూ శాఖలో వివిధ కేడర్లలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఇప్పటికే అనేకసార్లు మీ దృష్టికి తీసుకువచ్చామన్నారు. గతంలో అధికారులతో సమావేశం ఏర్పాటు చేసినప్పటికీ ఇప్పటివరకు సమస్యలకు ఎటువంటి పరిష్కారం లభించలేదన్నారు. దీంతో వీఆర్ఏలు, వీఆర్వోలు, సర్వేర్లు రెవెన్యూ సిబ్బంది అందరూ ఆందోళన చెందుతున్నారన్నారు. వెంటనే మా రెవిన్యూ ఉద్యోగుల సమస్యలపై చర్చించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు రావలసిన పెండింగ్ డిఏలు, ఐ ఆర్, పిఆర్సి కమిషన్ కు సంబంధించిన విషయాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని కోరారు. దీనిపై మంత్రి అనగాని స్పందిస్తూ రెవిన్యూ ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని, అలాగే ఉద్యోగులుకు ఇవ్వవలసిన పెండింగ్ డీఏలు, ఐ ఆర్, పిఆర్సి కమిషన్ కు సంబంధించిన ఆర్థికపరమైన విషయాలపై ముఖ్యమంత్రి తో చర్చిస్తానని హామీనిచ్చారు. ఉద్యోగులతో సానుకూల చర్చలు జరిపి న్యాయం చేస్తాం అని మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. సానుకూలంగా స్పందించిన రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలియజేశారని పత్రిక ప్రకటన ద్వారా ఆంధ్రప్రదేశ్ అమరావతి రెవెన్యూ ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ భూపతిరాజు రవీంద్ర రాజు తెలియజేశారు.
Prajavartha Online Telugu News