విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ నాయకుడు విజయసాయి రెడ్డి క్రైస్తవ మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని చేస్తున్న వ్యాఖ్యలను తక్షణం ఉపసంహారించుకుని క్షమానణలు చెప్పాలని ఏపీ క్రైస్తవ (మైనారిటీ) సొసైటీ తరుపున డిమాండ్ చేస్తున్నామని పాస్టర్ అరల్ ఆరుసు తెలిపారు. బుధవారం గాంధీనగర్ లోని ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడుతూ విజయ సాయిరెడ్డి తనపై ఉన్న కేసుల నుండి తప్పించుకోవడానికి క్రైస్తవులపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. నేడు రాష్ట్రంలో క్రైస్తవులపై విచిత్ర పరిస్థితులు ఎదురవుతున్నాయని అన్నారు. ప్రభుత్వ ప్రజాప్రతినిధులుగా, రాజకీయ నాయకులుగా ఉంటూ బాధ్యతకలిగిన వ్యక్తులు ఆర్థిక నేరగాళ్లుగా మారినప్పుడు తప్పించుకోవడానికి వారికి దొరికింది ఒకటే క్రైస్తవుల మతమార్పిడులు పెరిగిపోతుందని అనడం. ఇప్పుడు విజయ్ సాయి రెడ్డి కూడా ఈడి కేసు, లిక్కర్ స్కాం నుండి తప్పించుకోవడానికి అదే హస్రాన్ని ప్రయోగిస్తున్నారని అన్నారు. దేశ జనాభాలో 2 శాతం ఉన్న క్రైస్తవులపై విజయ సాయి రెడ్డి లాంటి ఆర్థిక నేరగాళ్లు మాట్లాడడం సిగ్గుచేటనీ చిక్కుకున్న కేసుల నుండి తప్పించుకోవడానికి అనవసరంగా క్రైస్తవులతో పెట్టుకుంటున్నారని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి క్రైస్తవ మతస్థుడని, వైసిపి ప్రభుత్వం హిందూ మతానికి ఎటువంటి సహాయ సహకారాలు చేయలేదని కేవలం క్రైస్తవ మతానికి మాత్రమే ఎక్కువగా ప్రోత్సహించేవాడని నమ్మశక్యం కాని అవాస్తవ విషయాలు మాట్లాడుతూ హిందూ, క్రిస్టియన్ ల మధ్య మత విద్వేషాలు చెలరేగేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నారు. వైసిపి ఓటమికి ఒక విధంగా ఆయన కుటిల రాజకీయం కారణమని ఆయన చేసిన కుంభకోణాలు, కబ్జాలు అందరికీ తెలుసునని వాస్తవాలు నిరూపించుకోలేక ఢిల్లీ హై కోర్టు నుండి గాగ్ ఆర్డర్ తెచ్చుకున్న అతను నీతులు చెప్పడం ఆశ్చర్యంగా ఉందని, హిందూ ఓట్లే లక్ష్యంగా క్రైస్తవ మైనార్టీలపై వ్యతిరేకంగా ఆరోపణలు చేస్తూ తన పార్టీ యొక్క లక్షాలను ప్రకటించడం హాస్యాస్పదశం అని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా క్రైస్తవ మైనార్టీలపై చేసిన వ్యాఖ్యలు, మత విద్వేషాలు రెచ్చగొట్టే మాటలు వెనక్కి తీసుకోవాలని ఆయన ప్రధానంగా డిమాండ్ చేశారు. దేశం అభివృద్ధి, ప్రజల క్షేమం కోసం తన శక్తి,తెలివి వినియోగిస్తే మంచిదని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ జేమ్స్ కుంపట్ల, పాస్టర్ జి.అనిల్ కుమార్, పాస్టర్ పాల్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News