Breaking News

పరిశుభ్రత ప్రమాణాలు పాటించని హోటళ్లకు జరిమానాలు

-లోపాలను సరిదిద్దకుంటే తదుపరి చర్యలు తప్పవు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ‘
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు, శుక్రవారం ఉదయం ప్రజారోగ్య విభాగం అధికారులు 37వ డివిజన్ పరిధిలోని కెనాల్ రోడ్ ప్రాంతంలో పలు హోటళ్లను తనిఖీ చేశారు.

ఈ తనిఖీలలో భాగంగా కెనాల్ రోడ్ ప్రాంతంలోని స్వీట్ మ్యాజిక్, తాజ్ హోటల్, హోటల్ సాయి సరోవర్, మంగమ్మ కిచిడీ సెంటర్‌లను అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా హోటళ్లలోని వంటగదులను పరిశీలించగా, కిచెన్ గదులకు టైల్స్ లేకపోవడం, గోడలు మరియు ఇతర ప్రదేశాల్లో బూజు ఏర్పడటం, గోడలు అపరిశుభ్రంగా ఉండటం, ఆహార పదార్థాలను మూతలు లేకుండా నిల్వ చేయడం, నిల్వ ఉన్న ఆహార పదార్థాలను గుర్తించడం, పరిసరాల్లో అపరిశుభ్ర వాతావరణం నెలకొని ఉండటం వంటి పలు లోపాలు గుర్తించారు.

అదేవిధంగా, నాణ్యమైన తాగునీటిని వినియోగించకపోవడం, మరుగుదొడ్లు సరిపడా లేకపోవడం, ఉన్న మరుగుదొడ్లను సక్రమంగా నిర్వహించకపోవడం, పరిశుభ్రత ప్రమాణాలను పాటించకుండా అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాల తయారీ మరియు విక్రయాలు నిర్వహించడం వంటి అంశాలను అధికారులు గుర్తించారు.

ప్రజారోగ్యానికి విఘాతం కలిగించే విధంగా అపరిశుభ్ర పరిస్థితుల్లో హోటల్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నందుకు సంబంధిత మూడు హోటళ్లకు ఒక్కొక్కదానికి రూ.5,000 చొప్పున జరిమానా విధించి నోటీసులు జారీ చేశారు.

నోటీసులు అందుకున్న హోటల్ యాజమాన్యాలు నిర్ణీత గడువులోగా గుర్తించిన లోపాలను పూర్తిస్థాయిలో సరిదిద్దుకోవాలని, పరిశుభ్రత మరియు ప్రజారోగ్య నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు ఆదేశించారు. నిర్ణీత గడువులోగా లోపాలను సరిచేయని పక్షంలో సంబంధిత యాజమాన్యాలపై చట్టప్రకారం తదుపరి చర్యలు చేపట్టడంతో పాటు, అవసరమైతే ట్రేడ్ లైసెన్సులను రద్దు చేయడం జరుగుతుందని హెచ్చరించారు.

నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, ఆహార విక్రయ కేంద్రాల నిర్వాహకులు పరిశుభ్రత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, నాణ్యమైన ఆహారం మరియు సురక్షితమైన తాగునీటిని ప్రజలకు అందించాలని అధికారులు సూచించారు.

ఈ తనిఖీలలో సర్కిల్–1 శానిటరీ సూపర్‌వైజర్ డి. సోమరాజు, శానిటరీ ఇన్స్పెక్టర్లు బి. యోగేంద్ర కుమార్, ఎం. రవిశంకర్ మరియు ప్రజారోగ్య విభాగం సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *