Breaking News

ఘనంగా జున్నూరు వాసు యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రసాదంపాడు, కస్తూరిస్కూలు రోడ్డులో జున్నూరు వాసు యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. సభ్యులందరి సమష్టి సహకారంతో వినాయకునితోపాటు అనంత పద్మనాభస్వామిని ఏర్పాటుచేసి మండపాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించి, గణనాథునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిధులుగా విచ్చేసిన ప్రసాదంపాడు ప్రెసిడెంట్ సర్నాల బాలాజీ, వివేకానంద స్కూల్ డైరెక్టర్ బొప్పన హరికృష్ణ మాట్లాడుతూ నిర్వాహకులను అభినందించారు. ఆధ్యాత్మిక శోభతో మురిసిన ప్రసాదంపాడు ఇక్కడ జరుగుతున్న నవరాత్రి ఉత్సవాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయన్నారు. భక్తిశ్రద్ధలతో ప్రతిరోజుచేస్తున్న ప్రత్యేక ప్పుూలు, అభిషేకాలు తదితర భక్తిరస కార్యక్రమాలతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభతో వెల్లివిరిసిందన్నారు. ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ప్రజలందరూ వర్ధిల్లాలని ఆ దేవుడిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఉత్సవ ప్రాంగణంలో నిర్వాహక కమిటీ ప్రెసిడెంట్ జున్నూరు వాసు మీడియాతో మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా ఈ గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తున్నామని దీపోత్సవం, అయ్యప్పస్వామి పూజ, అమ్మవారి కుంకుమ పూజ, భజనా కార్యక్రమాలు, అభిషేకాలు నక్షత్ర హారతులు ప్రతిరోజు ఉదయం సాయంత్రం నిత్య కార్యక్రమాలతో గణేష్‌ని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామన్నారు. అక్టోబర్ 1న అన్నదానం, అక్టోబర్ 4 (21 రోజులు) లడ్డూవేలంపాట వేసి భారీ ఎత్తున ఊరేగింపుతో నిమజ్జన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. వేడుకలను విజయవంతం చేయడానికి అహర్నిశలు శ్రమించిన కమిటీ సభ్యులు, భక్త బృంద సభ్యులకు, దాతలకు, సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, భారీ సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గౌరవప్రదమైన జీవనానికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని పటమట, రెల్లిస్ కాలనీలో గురువారం ఉదయం ఎన్టీఆర్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *