విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రజల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్. ఓ. సి ) లను జారీ చేస్తున్నారు. ఎమ్మెల్యే , సుజనా చౌదరి ఆదేశాలతో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కూటమి నాయకులతో కలిసి భవానిపురం, ఎన్డీయే కార్యాలయంలో బాధితులకు ఎల్ ఓ సీ పత్రాలను అందజేశారు. వించి పేటకు చెందిన సయ్యద్ సలీం (42) మౌత్ ఇన్ఫెక్షన్ సోకి తీవ్ర అనారోగ్యానికి గురై అత్యవసర వైద్యం కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ 4.32 లక్షల విలువైన ఎల్ ఓ సీ ను అందజేశారు. కే ఎల్ రావు నగర్ కు చెందిన గోపాలకృష్ణ ప్రతిభ(10) టాన్సిల్స్ తో బాధపడుతూ వైద్య సాయం కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ 2.40 లక్షల విలువైన ఎల్ ఓ సీ ను అందజేశారు. త్వరితగతిన స్పందించి ఎల్ ఓ సీ ను అందజేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరి కు బాధితుల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
మాజీ కార్పొరేటర్లు ముప్పా వెంకటేశ్వరరావు, బుల్లా విజయ్ కుమార్, మహ్మద్ అబ్దుల్ ఖాదర్, కూటమి నేతలు కామ దేవరాజ్, నాగోతి రామారావు, దుర్భేసుల హుస్సేన్,కొణిజేటి రమేష్ మోరబోయిన రాంబాబు, పచ్చి పులుసు వెంకట శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News