విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు నియోజకవర్గం 21వ డివిజన్ రణధీర్ నగర్ కట్ట మీద నివసించే సన్నల భవాని(14), సన్నల సుమతి( 13) వారి తల్లిదండ్రులు ఇద్దరు కూడా మరణించి చిన్నారులు ఆనాధలు అయిన విషయం తెలుసుకొని స్థానిక కార్పొరేటర్ పుప్పాల కుమారిగారు మానవత దృక్పథంతో స్పందించి నియోజకవర్గ ఇంచార్జి శ్రీ దేవినేని అవినాష్ గారి దృష్టికి తీసుకువెళ్లగా తక్షణమే స్పందించిన అవినాష్ అగిరిపల్లి మండలం, తోటపల్లి గ్రామంలోని హీల్ పారడైస్ అనాధాశ్రమ యాజమాన్యంతో మాట్లాడి చిన్నారులను చేర్పించడం జరిగింది. అంతేకాకుండా చిన్నారులకు కావాల్సిన అన్ని సదుపాయాలు సమకూర్చి వారికీ ప్రభుత్వం తరుపున వచ్చే అన్ని పథకాలు వచ్చేలా చూస్తామని చెప్పారు.వారు వారి కాళ్ల మీద నిలబడెవరకు వ్యక్తిగతంగా, ప్రభుత్వ పరంగా అండగా ఉంటానని అవినాష్ భరోసా ఇచ్చారు. ఈ సంధర్భంగా అవినాష్ గారు స్థానిక కార్పొరేటర్ పుప్పాల కుమారిగారిని అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Tags vijayawada
Check Also
పుస్తకాలు, కిటికీలు తెరిస్తే.. అవి జ్ఞాన ద్వారాలు తెరుస్తాయి
-నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురణల ఆవిష్కరణ సభలో సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ బి శ్రీనివాసరావు IAS విజయవాడ, …