Breaking News

పుస్తక పఠనం వలన సృజనాత్మకత, ఏకాగ్రత, జ్ఞానం పురోగతి వృద్ధి చెందుతాయి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పుస్తక పఠనం వలన సృజనాత్మకత, ఏకాగ్రత, జ్ఞానం పురోగతి వృద్ధి చెందుతాయని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ కమీషనర్‌ టి విజయకుమార్‌ రెడ్డి అన్నారు.
32వ విజయవాడ పుస్తక మహోత్సవం సందర్భంగా శుక్రవారం కాళీపట్నం రామారావు సాహిత్య వేదికపై నిర్వహించిన వడ్డాది పాపయ్య శత జయంతి సభకు సమాచార పౌర సంబంధాల శాఖ కమీషనర్‌ టి విజయకుమార్‌ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుస్తకం చదివిన తరువాత బహుళ ఆలోచన విధానాలు మనస్సులో జనిస్తాయన్నారు. దీనివలనే సమాజం చైతన్యవంతం అవుతుందని ప్రజల ఆలోచనలు కూడా వికసిస్తాయని ఆయన పేర్కొన్నారు. చిత్రం చూడడం కంటే పుస్తక పఠనం వల్లే ఏకాగ్రత సాధ్యపడుతుందని కమీషనర్‌ అన్నారు. వడ్డాది పాపయ్య 50 సంవత్సరాలు పాటు ఒకే సంస్థలో పనిచేయడం, ఆ సంస్థ విజయంలో భాగస్వామ్యం కావడం చాలా గొప్పవిషయం అన్నారు. చందమామ పత్రికలో, కథలు చదువుతుంటే నేటి బాహుబలి సినిమాలను తలపిస్తున్నాయన్నారు. ప్రముఖ చిత్రకారుడు వడ్డాది పాపయ్య ఆంధ్రుడు కావడం మన రాష్ట్రానికే గర్వకారణమని, ఆయన చందమామ, స్వాతి, ఆంధ్రభూమి తదితర పత్రికల్లో ఆయన చిత్ర లేఖనం ద్వారా గీసిన వేలాది చిత్రాలు పాఠకులను ఎంతగానో హత్తుకున్నాయన్నారు. దేశానికే గర్వకారణమైన చిత్రకారుడు వడ్డాది పాపయ్య అని ప్రాచీన సాహిత్యాన్ని ఆకళింపు చేసుకొని తన కుంచెకు సాహితీ సౌరభాన్ని పులిమి చిత్రాలను చిత్రించిన ప్రత్యేక చిత్రకారుడు వడ్డాది పాపయ్య అని అన్నారు. సామాన్యమైన రంగుల నుండి అత్యదుృతమైన బొమ్మలను ఇంద్రధనుస్సులో కూడా కానరాని రంగుల కలయికను చూపగలిగిన వ్యక్తి వడ్డాది పాపయ్య అని అన్నారు. ఆయన కళాజీవితం ఎంత ఉన్నతమో వ్యక్తిగత జీవితం అంతకంటే గొప్పది అని అన్నారు. తెలుగు నాట చిత్రకళలో ఈయన శైలికి, బొమ్మలలోని సంతకానికి, అందినంత గుర్తింపు గౌరవ ప్రతిష్టలు మరెవరికీ అందలేదనే చెప్పవచ్చునని కమీషనర్‌ విజయకుమార్‌ రెడ్డి అన్నారు.
తొలుత కమీషనర్‌ స్వరాజ్య మైదానంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను, అక్కడ ఉన్న పుస్తకాలను ఆసక్తిగా పరిశీలించారు. అనంతరం కమీషనర్‌ మాట్లాడుతూ విజయవాడ నగరం సాహితీ ప్రియులకు పెట్టింది పేరన్నారు. అనేక మంది కవులు, కళాకారులకు, విజయవాడ నగరం పుట్టినిల్లు అని అన్నారు. దాదాపు 140కు పైగా స్టాల్స్‌ ఏర్పాటు చేశారన్నారు. ప్రతీ ఏడాది ఇటువంటి పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేయడం పట్ల నిర్వహకులను కమీషనర్‌ అభినందించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గుంటూరు జిల్లాలో ఉన్న యువతి యువకులకు గొప్ప సువర్ణ అవకాశం – పీఎం ఇంటర్న్‌షిప్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్ద ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారి ఆదేశముల మేరకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *