విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కోవిడ్ నియంత్రణకు పకడ్భంధీ చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఎల్.శివ శంకర్ అన్నారు. జిల్లా వ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నగరంలోని సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కోవిడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ సెంటర్‌ను గురువారం జాయింట్ కలెక్టర్ శివశంకర్ పరిశీలించారు. కోవిడ్ మూడోదశలో కేసుల సంఖ్య అధికంగా పెరిగే అవకాశం ఉందని, అందుకు తగిన విధంగా కమాండ్ కంట్రోల్ రూమ్ లో సదుపాయాలు ఉండాలని సూచించారు. గతంలో రెండు దశలను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని, ఆ అనుభవంతో మూడోదశను కట్టడి చేయాలని కోరారు. గతంలో ఎదురైన ఇబ్బందులను పరిగణలోనికి తీసుకుని మరింత సమర్థవంతంగా కోవిడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో విధులు నిర్వర్తించాలని అధికారులను జాయింట్ కలెక్టర్ కోరారు. నియోజకవర్గాల్లో ఏర్పాటుచేసిన కోవిడ్ కేర్ సెంటర్లను కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానించడం జరిగిందన్నారు. వచ్చిన ప్రతీ ఫోన్‌కాల్‌కు వెంటనే స్పందించి, తగిన సమాచారాన్ని, సహాయాన్ని అందించాలని కంట్రోల్ రూమ్ నిర్వాహకులకుసూచించారు. కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేసిన సెంటర్లను అనుసంధానించటంవల్ల పర్యవేక్షణ మరింత సులభతరం అవుతుందని జాయింట్ కలెక్టర్ శివశంకర్ అన్నారు.
Tags vijayawada
Check Also
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు స్పందించాలి
-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 8వ తేదీన విశాఖపట్నంలో పర్యటించిన …