ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Pawan

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
ప్రతి ఇంటా వెలుగులు నింపి ఆనందం, ఆరోగ్యం, శుభాలను అందించే దీపావళి పర్వదినం సందర్భంగా ప్రతి భారతీయుడికీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

దీపకాంతిని పరబ్రహ్మ స్వరూపంగా ఆరాధించే గొప్ప సంస్కృతి మనదని, నరకాసురుడి వధ అనంతరం మానవాళికి సుఖసంతోషాలు కలగడంతో దీపాలు వెలిగించి దీపావళి వేడుకలు జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ పర్వదినాన ప్రజలందరికీ సంపూర్ణ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తూ, సంక్షేమ పథకాల ద్వారా ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతోందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టణ, గ్రామీణ ప్రాంతాల ప్రజలు కూటమి అభ్యర్థులకు మద్దతుగా నిలిచి విజయాన్ని అందించడం ద్వారా ముందుగానే దీపావళి సంబరాలను తీసుకొచ్చారని ఆయన అన్నారు.