తెలుగు ప్రజలకు నందమూరి బాలకృష్ణ దీపావళి శుభాకాంక్షలు

Balakrishna

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
దీపావళి పండుగను పురస్కరించుకుని ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవిదేశాల్లో స్థిరపడిన తెలుగు ప్రజలందరికీ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, విలువలను సజీవంగా ఉంచే పండుగల్లో దీపావళి ముఖ్యమైనదని పేర్కొన్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కుల, మత, ప్రాంతీయ, భాషా భేదాలు లేకుండా ప్రజలందరూ ఐకమత్యంతో జరుపుకునే దీపాల పండుగ దేశంలోని భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు.

దుష్టశిక్షణ, శిష్టజన రక్షణకు, చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా జరుపుకునే దీపావళి ప్రతి ఒక్కరి జీవితాల్లో అష్టైశ్వర్యాలు, ఆనందోత్సాహాలు నింపాలని ఆకాంక్షించారు. అజ్ఞానపు చీకట్లను తొలగించి ప్రతి ఒక్కరి జీవితాలను జ్ఞానజ్యోతులతో, సంతోషాలతో వెలిగించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు.