-మంగళగిరి క్యాంపు కార్యాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి భేటీ
మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త:
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌ను విజయవాడ మేయర్‌గా ఎన్నికైన వంగవీటి రాధాకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో వంగవీటి రాధాకృష్ణ తన కుటుంబ సభ్యులతో కలిసి పవన్ కళ్యాణ్‌ను భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తనకు సహకరించినందుకు, మేయర్‌గా ఎన్నికైన నేపథ్యంలో పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మర్యాదపూర్వక భేటీ సందర్భంగా ఇరువురి మధ్య ఆత్మీయ పలకరింపులు చోటుచేసుకున్నాయి.
