అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిర్వహిస్తున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రితో పాటు సహచర మంత్రులతో కలిసి ఆయన కేబినెట్ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించేందుకు నిర్వహిస్తున్న ఈ మంత్రివర్గ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొనడం విశేషం.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో మంత్రివర్గ భేటీ
