పాలక సంస్థల ఏర్పాటు కోసం మున్సిపాల్టీలు ముస్తాబు…

* కృష్ణా కలెక్టర్‌ ఏ.యండి.ఇంతియాజ్ వెల్ల‌డి

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త ‌: జిల్లాలో విజయవాడ, మచిలీపట్నం కార్పోరేషన్‌లతో పాటు మరో ఐదు మున్సిపాల్టీల పాలక సంస్థల ఏర్పాటు కోసం కార్యాలయాలు ముస్తాబయ్యాయని కృష్ణాజిల్లా కలెక్టర్‌ ఏ.యండి.ఇంతియాజ్ చెప్పారు. బుధవారం కలెక్టరు క్యాంపు కార్యాలయంలో విజయవాడ కార్పోరేషన్ మున్సిపల్ కమిషనర్ వి.ప్రసన్న వెంకటేష్‌తో కలిసి పాత్రికేయుల సమావేశంలో కలెక్టర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ఇంతియాజ్ మాట్లాడుతూ గురువారం ఉదయం 11 గంటలకు విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్, మచిలీపట్నం కార్పోరేషన్‌ల మేయరు, డిప్యూటి మేయర్లును ఎంపిక జరుగుతుందని పేర్కొన్నారు. అలాగే నూజివీడు, నందిగామ‌, పెడన, ఉయ్యూరు మున్సిపాల్టీలు, నగర పంచాయతీల కోసం ఛైర్మన్‌లు, వైస్ చైర్మన్‌ల ఎంపిక ప్రక్రియ జరుగుతుందన్నారు. విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్‌కు కలెక్టర్‌ హోదాలో తాను ప్రిసైడింగ్ అధికారిగా, మచిలీపట్నం మున్సిపల్ కార్పోరేషన్‌కు జిల్లా జాయింట్ కలెక్టర్‌ (రెవెన్యూ) ప్రిసైడింగ్ అధికారిగానూ వ్యవహరిస్తారని తెలిపారు. జిల్లాలోని రెండు మున్సిపాల్టీలు, మూడు నగర పంచాయతీలకు చెందిన ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌లను ఎంపిక కోసం ప్రత్యేక అధికారులను నియమించామన్నారు. అందులో నూజివీడు మున్సిపాల్టీకి నూజివీడు సబ్ కలెక్టరు, పెడన మున్సిపాల్టీకి ఆర్డీవో, బందరు, ఉయ్యూరు నగర పంచాయతీకి ఆర్డీవో గుడివాడ, నందిగామ నగరపంచాయతీకి డిఆర్డీడిఏ ప్రాజెక్టు డైరెక్టర్‌, తిరువూరు నగర పంచాయతీకి జిల్లా యూత్ వెల్ఫేర్ ఆఫీసర్ ప్రిసైడింగ్ అధికారులుగా వ్యవహరిస్తారని కలెక్టర్‌ తెలిపారు. ఈ మొత్తం ప్రక్రియలో భాగంగా మొదట ఆయా మున్సిపల్ కార్పోరేషన్‌లు, మున్సిపాల్టీలు, నగర పంచాయతీలు ఎన్నుకున్న కార్పోరేటర్లు/ కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం నిర్వహిస్తామన్నారు. అనంత‌రం సభ్యులు చేతులు ఎత్తి మేయరు/చైర్మన్ఎన్నికలలో పాల్గొంటారని, అనంతరం డిప్యూటి మేయరు/వైస్ చైర్మన్‌ల ఎంపిక సభ్యుల ఆమోదంతో జరుగుతుందని తెలిపారు. సంబంధిత యంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఎక్స్ అఫీషియో సభ్యులుగా హాజరవుతారన్నారు. స్థానిక సంస్థలకు జరిగిన పురపాలక సంఘాల ఎన్నికలలో గెలుపొందిన అభ్యర్ధులకు ఇప్పటికే వారు గెలుపొందినట్లు ఆయా రిటర్నింగ్ అధికారులు ద్వారా ఫారం-2 ధృవీకరణ పత్రాలను అందజేసినట్లు కలెక్టరు వెల్ల‌డించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నేటి పత్రిక ప్రజావార్త :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *