-నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మరియు కమిషనర్ పి.రంజిత్ భాషా, ఐ.ఏ.ఎస్,
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ నందు నిర్వహించిన జలశక్తి అభియాన్, క్యాచ్ ది రైన్–2022 కార్యక్రమమును వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా భారత రాష్ట్రపతి కార్యక్రమాన్ని ప్రారంభించినారు. ఈ కార్యక్రమములో కమిషనర్ పి.రంజిత్ భాషా, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, అధికారులతో కలిసి జలశక్తి అభియాన్, క్యాచ్ ది రైన్ పోగ్రాం మీద ప్రతిజ్ఞా (నీటి శపధం) చేసినారు.
1. నేను నీటిని సంరక్షిస్తానని, పొదుపుగా వాడుకుంటానని శపధం చేస్తున్నాను.
2. నేను నీటిని అవసరం మేరకే వాడుకుంటానని, ఒక్క నీటి బొట్టును కూడా వృధా చేయనని శపధం చేస్తున్నాను.
3. నేను ప్రతి నీటి బొట్టును సంరక్షిస్తాను, జలశక్తీ అభియాన్ వాన నీటిని వడిసిపట్టు కార్యక్రమoలో మనస్పూర్తిగా భాగస్వామినవుతాను. నేను నీటిని విలునైన సంపదగ భావిస్తాను.
4. నా కుటుంభ సభ్యులను, మిత్రులను, పోరుగువారిని నీటిని వృధా చేయకుండా అవసరం మేరకు, సమర్ధవంతంగా వాడుకొనే విధంగా చైతన్య పరుస్తానని శపధం చేస్తున్నాను.
5. మన భుగోళాన్ని మనమే రక్షించుకుని భవిష్యత్తును కాపాడుకుందాo. మనమంతా కలిసి, జల అందోళనను జన అందోళనగా ముందుకు తిసుకెల్దాం.
కమిషనర్ మరియు మేయర్ మాట్లాడతూ ఈ కార్యక్రమములోని జలశక్తి అభియాన్, క్యాచ్ ది రైన్ వచ్చే వర్షకాలం లోపు పూర్తి చేయాలని అధికారులకు తగు సూచనలు ఇచ్చినారు.
కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ , చీఫ్ ఇంజనీర్ యమ.ప్రభాకర రావు, సిటి ప్లానర్ జి.వి.జి.ఎస్.వి ప్రసాద్, మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.