నిరుపేద కుటుంబానికి LOC ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సాయం మంజూరు

-జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త:
జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని బోరబండ, అనంతయ్య బస్తీ, ఇందిరానగర్‌కు చెందిన డి. సుబ్రహ్మణ్యం రాజు వైద్య చికిత్స నిమిత్తం (LOC ) ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సాయం మంజూరైంది. అనారోగ్యంతో బాధపడుతున్న బాధితుడి వైద్య చికిత్సకు ఆర్థిక సహాయం అందించాలని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కి విజ్ఞప్తి చేయగా, ఎమ్మెల్యే అభ్యర్థనపై స్పందించిన ముఖ్యమంత్రి రూ.5 లక్షల విలువైన ఎల్‌ఓసీ (LOC) మంజూరు చేశారు. ఈ ఆర్థిక సాయంతో బాధితుడికి నిమ్స్ ఆసుపత్రిలో అవసరమైన వైద్య చికిత్స అందించనున్నారు. ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు అండగా నిలుస్తూ, మెరుగైన వైద్యం అందించేందుకు సహకరిస్తున్న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కి ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆరోగ్యం, సంక్షేమమే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు.