అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపీ సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కలిశారు. అమరావతిలో కొత్తగా నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్ధానం ప్రారంభోత్సవానికి సీఎంను ఆహ్వానించారు. ఈ నెల 4నుంచి విగ్రహ ప్రతిష్టకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ప్రారంభం, 9న విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ, మహా సంప్రోక్షణ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ముఖ్యమంత్రికి స్వామివారి ప్రసాదాలు అందజేసి టీటీడీ వేద పండితులు ఆశీర్వచనాన్ని అందించారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆహ్వాన పత్రాన్ని సీఎంకు అందజేశారు. ఆయన వెంట జేఈవో వి.వీరబ్రహ్మం, సీఎస్‌వో నరసింహ కిశోర్, చీఫ్ ఇంజనీర్ డి.నాగేశ్వరరావు ఉన్నారు.
Tags AMARAVARTHI
Check Also
ప్రధాని మోదీ ప్రపంచం మెచ్చిన నాయకుడు
-అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణలు, సుపరిపాలన మోదీ నినాదాలు -ఒకేరోజున రూ.2,08,548 కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఒక రికార్డ్ -ఇంతటి …