Breaking News

పొదిలి వక్ఫ్ స్థలాలను కాపాడండి…

-హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ను ఆశ్రయించిన ముతవల్లి షేక్. సులేమాన్

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త :
పొదిలి లోని ముతవల్లి సంరక్షణాలోని వక్ఫ్ స్థలాలను కొంతమంది దళారీలు చింత తోపు, కాటూరి వారిపాలెం వడ్డే పాలెం, మరిపూడి రోడ్డు ప్రాంతాల్లోని వక్ఫ్ స్థలాలను అన్యాక్రాంతం చేస్తూ కోట్లను చేయి మారుస్తూ రాజకీయ నాయకులను, అధికారులను నయాన్నో, భయాన్నో వారి గుప్పెటలో ఉంచుకొని ముస్లింలకు చెందవలసిన వక్ఫ్ స్థలాలను అమ్మేస్తున్నారని, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరుపున కేంద్ర, రాష్ట్ర ఉన్నతాధికారులతో మాట్లాడి అన్యాక్రాంతం నుంచి తమవంతు ప్రయత్నం చేయాలని ఆ స్థలాలను కాపాడాలని, రాష్ట్రంలో కొంతమంది ముతవల్లిలను రిమార్కు లేకపోయినా దళారులకు అండగా నిలిచి రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ కమిటీ పక్కన పెట్టారని అలాంటి జాబితాలోని వారిని ముతవల్లి బాధ్యతలు అప్పజెప్పాలని ఈ విషయంలో కోర్టు కూడా అన్యాయం గా పక్కన పెట్టిన ముతవల్లిలను తమ బాధ్యతలు ఇవ్వాలని కోర్టు ఆర్డర్ ఇచ్చిందని తమకు కూడా న్యాయం జరిగే విధంగా సహకరించాలని శనివారం  హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జాతీయ ఉపాధ్యక్షులు షేక్. ఖలీఫా తుల్లా బాషా ని ఒంగోలు లోని ఆయన నివాసంలో కలిసి వినతి పత్రాన్ని ఇచ్చిన పొదిలి ముతవల్లి వక్ఫ్ స్థలాల సంరక్షకుడు  షేక్. సులేమాన్ తదితరులు. ఈ సందర్భంగా షేక్. ఖలీఫా తుల్లా బాషా మాట్లాడుతూ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరఫున కేంద్ర, రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని, వక్ఫ్ బోర్డ్ కేంద్ర కమిటీకి తీసుకుని వెళ్లి తగు న్యాయం జరిగే విధంగా చూస్తానని హామీ ఇచ్చినట్లు విడుదలచేసిన ప్రకటనలో తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : కొమొరిన్ నుండి కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా మధ్యప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *