అత్యవసర వైద్యం కోసం ఎల్ ఓ సీ అందజేత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఎమ్మెల్యే సుజనా చౌదరి చొరవతో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన ఎల్ ఓ సీ ను కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కూటమి నేతలతో కలిసి అందజేశారు 40 వ డివిజన్ , ఊర్మిళ నగర్ కు చెందిన వేల్పుల జ్యోతి (55) హృద్రోగంతో బాధపడుతూ అత్యవసర వైద్యం కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ 8.63 లక్షల విలువైన ఎల్ ఓ సీ ను భవానిపురం లోని ఎమ్మెల్యే కార్యాలయంలో అందజేశారు. త్వరితగతిన స్పందించి ఎల్ ఓ సీ ను అందజేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరి కు బాధితుడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా బీజేపీ మైనార్టీ మోర్చా అధ్యక్షుడు దుర్బేసుల మీరావలి, 40 వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షుడు బొల్లేపల్లి కోటేశ్వరరావు, కూటమి నేతలు కామ దేవరాజ్, దాడి అప్పారావు, దుర్బేసుల హుస్సేన్, షేక్ కరిముల్లా, చుక్కా నరేష్ తదితరులు పాల్గొన్నారు.