అత్యవసర వైద్యం కోసం ఎల్ ఓ సీ అందజేత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఎమ్మెల్యే సుజనా చౌదరి చొరవతో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన ఎల్ ఓ సీ ను కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కూటమి నేతలతో కలిసి అందజేశారు. 40 వ డివిజన్, ఊర్మిళ నగర్ కు చెందిన సాధు లీలా ప్రసాద్ (47) హృద్రోగం తో బాధపడుతూ అత్యవసర వైద్యం కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ 4 లక్షల విలువైన ఎల్ ఓ సీ ను అందజేశారు. త్వరితగతిన స్పందించి ఎల్ ఓ సీ ను అందజేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరి కు బాధితుడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కూటమి నాయకులు మోరబోయిన రాంబాబు, బొల్లెపల్లి కోటేశ్వరరావు , దాడి అప్పారావు, దుర్బేసుల హుస్సేన్, హరీష్ వ్యాస్, పసుపులేటి శివ, గాలేటి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.