-నవంబర్ 18న జరగాల్సిన గ్రామ పంచాయతీ రెండో విడత సాధారణ ఎన్నికల ప్రిసైడింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమం వాయిదా
-నవంబర్ 19న ఉదయం 11 గంటలకు నిర్వహణ
-విజయవాడ స్వరాజ్య మైదానంలోని బి.ఆర్. అంబేద్కర్ కళావేదికలో శిక్షణ కార్యక్రమం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
గ్రామ పంచాయతీ రెండో విడత సాధారణ ఎన్నికల నిర్వహణలో భాగంగా ప్రిసైడింగ్ అధికారులకు ఈ నెల 18వ తేదీ ఉదయం 10.00 గంటలకు విజయవాడలోని ఎం.జి. రోడ్డులో ఉన్న స్వరాజ్య మైదానం బి.ఆర్.అంబేద్కర్ కళావేదికలో నిర్వహించాల్సిన శిక్షణ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి.లక్ష్మీశ ఒక ప్రకటనలో తెలిపారు.
6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో, ప్రిసైడింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమాన్ని ఈ నెల 19వ తేదీ ఉదయం 11.00 గంటలకు వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. కావున సంబంధిత ప్రిసైడింగ్ అధికారులు ఈ మార్పును గమనించి, నవంబర్ 19వ తేదీ ఉదయం 11.00 గంటలకు బి.ఆర్.అంబేద్కర్ కళావేదిక, ఎం.జి. రోడ్, స్వరాజ్య మైదానం, విజయవాడలో జరిగే శిక్షణ కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరుకావాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి.లక్ష్మీశ సూచించారు.
