రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకత్వంలో స్థానిక సంస్థల ఎన్నికలకు పటిష్ట భద్రతా చర్యలు

-ప్రశాంతంగా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పటిష్ట భద్రతా చర్యలు
-ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పటిష్టమైన శాంతిభద్రతల చర్యలు
-ఐజీ బి. రాజకుమారి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) మార్గదర్శకత్వంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ రాష్ట్రవ్యాప్తంగా రెండో విడత సాధారణ స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు విస్తృతమైన భద్రతా చర్యలు చేపట్టిందని మంగళవారం ఒక ప్రకటనలో ఐజీ రాజకుమారి తెలిపారు. 2026 నవంబర్ 14 వ తేదీ నుంచి నవంబర్ 16 వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన శాంతిభద్రతల పరిరక్షణ చర్యలు, నమోదు చేసిన కేసులు, ఇతర వివరాలు ఇలా ఉన్నాయి.

శాంతిభద్రతల పరిరక్షణ – ముఖ్య గణాంకాలు

నమోదైన ఎఫ్‌ఐఆర్‌లు 24

ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ) ఉల్లంఘన కేసులు 444

స్వాధీనం చేసుకున్న మద్యం 200.55 లీటర్లు

బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్లు 126/129 కింద బైండ్ ఓవర్ చేసిన కేసులు 722

బైండ్ ఓవర్ చేసిన వ్యక్తులు 5,327

ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా, ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీస్ శాఖ అన్ని ముందస్తు భద్రతా చర్యలు చేపట్టిందని ఐజీ బి. రాజకుమారి ఆ ప్రకటనలో తెలియజేశారు.