-నవంబర్ 19న జరగాల్సిన జాబ్ మేళా 26వ తేదీకి మార్పు
-నవంబర్ 26వ తేదీ ఉదయం 9 గంటలకు ఎస్.ఆర్.ఆర్ అండ్ సి.వి.ఆర్ కళాశాలలో నిర్వహణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎస్.ఆర్.ఆర్ అండ్ సి.వి.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల జవహర్ నాలెడ్జ్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో నవంబర్ 19న నిర్వహించాల్సిన మెగా జాబ్ మేళాను ఆక్వాన్ తుఫాను నేపథ్యంలో వాయిదా వేసినట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ జాబ్ మేళాను నవంబర్ 26వ తేదీ గురువారం ఉదయం 9.00 గంటలకు విజయవాడ మాచవరంలోని ఎస్.ఆర్.ఆర్ అండ్ సి.వి.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9032633548 నంబరును సంప్రదించవచ్చని తెలిపారు.
