విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు లాకా వెంగళరావు యాదవ్ సారధ్యంలో మహిళలు విద్యార్థులు కమిటీ నియామకం జరిగింది. ఈ సందర్భంగా లాకా వెంగళరావు యాదవ్, మాట్లాడుతూ సంక్షేమ సంఘం అభివృద్ధికి విద్యార్థులు మహిళలు ఎంతో అవసరమని వారు అధిక సంఖ్యలో పాల్గొన్నందుకు చాలా ఆనందకరంగా ఉందని అన్నారు. ఆగస్టు 2, 3 తేదీల్లో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద చట్టసభల్లో రిజర్వేషన్లు గురించి జరిగే ధర్నా కార్యక్రమానికి అధిక సంఖ్యలో బీసీలు హాజరు అవ్వాలని రాజ్యసభ సభ్యులు జాతీయ నాయకులు ఆర్ కృష్ణయ్య పిలుపుమేరకు, పార్టీలకు అతీతంగా బీసీలందరు పాల్గొనాలని ఆయన కోరారు. అనంతరం ఎన్టీఆర్ జిల్లా విద్యార్థి విభాగమునకు బాయన త్రినాథ్ జిల్లా అధ్యక్షుడిగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బీసీ అర్బన్ అధ్యక్షుడు కనిశెట్టి లక్ష్మణరావు, బీసీ నాయకులు మల్లేష్, ప్రచార కమిటీ చైర్మన్ జక్కల శ్రీనివాస్, బీసీ నాయకులు దాడి అప్పారావు, మహిళా విభాగ నాయకురాలు జయలక్ష్మి, కె.లీలావతి, విద్యార్థులు మహిళలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రధాని మోదీ ప్రపంచం మెచ్చిన నాయకుడు
-అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణలు, సుపరిపాలన మోదీ నినాదాలు -ఒకేరోజున రూ.2,08,548 కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఒక రికార్డ్ -ఇంతటి …