భీమేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త:
గుంటూరు అమరావతి రోడ్డులోని అన్నదాన సత్రం వద్ద కొలువై ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి సమేత శ్రీ భీమేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో గుంటూరు నగర మేయర్ కోవెలమూడి లక్ష్మీ అపర్ణ, తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆలయ పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ ఆలయ పునర్నిర్మాణ పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా త్వరితగతిన పూర్తికావాలని, పరమేశ్వరుని కృపాకటాక్షాలు గుంటూరు నగర ప్రజలందరిపై ఉండాలని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ నూతలపాటి సాంబశివరావు, కార్యనిర్వహణ అధికారి గుర్రం శ్రీనివాసరావు, స్థానిక కార్పొరేటర్లు కొమ్మినేని కోటేశ్వరరావు, పేరం శ్రీనివాసరావు, ఎలుక ధనలక్ష్మి, కూటమి నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.