అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
ప్రజారాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన 28 మంది రైతులకు శుక్రవారం 2026 నవంబర్ 20న రాయపూడిలోని ఏపీ సిఆర్డిఏ కార్యాలయంలో అడిషనల్ కమిషనర్ ఏ. భార్గవతేజ ఐఏఎస్ ఆధ్వర్యంలో ఈ- లాటరీ విధానం ద్వారా 44 రిటర్నబుల్ ప్లాట్లను కేటాయించారు. కార్యక్రమానికి హాజరైన రైతుల సమక్షంలో ఆన్లైన్ ర్యాండమ్ సిస్టం ద్వారా నివాస, వాణిజ్య ప్లాట్లకు ముందుగా ట్రైల్ రన్ వేసిన అనంతరం ప్రత్యక్ష లాటరీ ప్రక్రియను చేపట్టడం జరిగింది. రిటర్నబుల్ ప్లాట్లు పొందిన రైతులకు APCRDA ల్యాండ్స్ విభాగ డైరెక్టర్(క్యాపిటల్ సిటీ) కె.ఎస్. భాగ్యరేఖ ప్రొవిజనల్ సర్టిఫికెట్లు అందజేశారు. నెగోషియేటెడ్ సెటిల్మెంట్ పాలసీ(NSP) అమలులో భాగంగా రాజధాని నిర్మాణానికి భూములను అందజేసిన అబ్బరాజుపాలెం, బోరుపాలెం, శాఖమూరు గ్రామాలకు చెందిన 27 మంది రైతులకు 23 రెసిడెన్షియల్ ప్లాట్లను, అలాగే LPS కింద ఇటీవల భూములు ఇచ్చిన అబ్బరాజుపాలెంకు చెందిన ఒక రైతుకు 14 రెసిడెన్షియల్, 7 కమర్షియల్ ప్లాట్లను అధికారులు కేటాయించారు.
రిటర్నబుల్ ప్లాట్లు పొందిన రైతులు రిజిస్ట్రేషన్ ప్రక్రియను త్వరతిగతిన పూర్తి చేసుకోవాలని భాగ్యరేఖ కోరారు. ప్లాట్లు పొందిన రైతులకు భౌగోళికంగా వారికి ప్లాట్లు ఎక్కడ కేటాయించబడ్డాయో వివరించడానికి జి.ఐ.ఎస్. సిబ్బంది, గ్రామ సర్వేయర్లు సహకరిస్తారన్నారు. కార్యక్రమంలో ప్లానింగ్ విభాగ డైరెక్టర్ బి. సురేష్ కుమార్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు పి.పద్మావతి, జి.మురళీధర్, గుంటూరు LPS కో ఆర్డినేషన్ డిప్యూటీ కలెక్టర్ వి.డేవిడ్ రాజు, IT, ప్లానింగ్, GIS, కమ్యూనికేషన్స్ విభాగ సిబ్బంది పాల్గొన్నారు.
