మదర్సా లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త :
ఒంగోలు నగరంలోని శివారు ప్రాంతమైన వెల్లూర్ గ్రామము నందు గల దరూల్ ఉలూహ్మసన తుల్ అబ్రార్ ట్రస్ట్ మదర్సా లో 75 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమనికి ముఖ్యఅతిథిగా హాజరైన హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నేషనల్ వైస్ ప్రెసిడెంట్ షేక్. ఖలీఫాతుల్లా బాషా జాతీయ జండా వందనం చేసి మదర్సా విద్యార్థులు నూదేశించి మాట్లాడుతూ మన స్వాతంత్ర్య సమర యోధులు చేసిన త్యాగం ,పరాక్రమం ఇంకా వారి నిబద్ధత వలనే ఈ రోజు మనం 75 వ స్వాతంత్ర్య దినోత్సవం ఘనంగా జరుపుకోగలుగుతున్నామని అన్నారు. ఈ రోజు మన దేశములో స్వేచ్ఛ స్వాతంత్ర్యo గా జీవిస్తునం అంటే బాబా సాహిబ్ బీఆర్ అంబేద్కర్ అందించిన రాజ్యంగా హక్కు మరియు ఫలాలేనని అదీగాక ఆనాడు సమైక్యంగా కుల మతాలకు అతీతంగా స్వాతంత్ర్య సమరంలో పోరాడి అమరులైన మహనీయుల త్యాగలేనన్నారు.మదర్సా లోని విద్యార్థులు ఖురాన్ బోధనతో పాటు దేశ భక్తికీ ప్రాముఖ్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మదర్సా ఛైర్మన్ సయ్యద్ మౌలానా రఫీ,మదర్సా గురువులు మౌలానా హనీఫ్ ఖాన్, హాఫిజ్ మహ్మద్ షరీఫ్,ఆదిల్ ఇన్నోవేషన్ క్లబ్ డైరెక్టర్ షేక్. అహీత్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *