గార్వి పండుగ వేడుకల్లో పాల్గొన్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త:
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఎల్లారెడ్డిగూడలో నిర్వహించిన గార్వి పండుగ వేడుకలకు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్ హాజరై వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు, స్థానిక ప్రజలు ఎమ్మెల్యే కి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పండుగలు మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని, ఇటువంటి వేడుకలు ప్రజల మధ్య ఐక్యత, సోదరభావం, ఆత్మీయతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.