శ్రీ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న ఉప లోకాయుక్త పి. రజని

కంఠంరాజు కొండూరు, నేటి పత్రిక ప్రజావార్త:
గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం కంఠంరాజు కొండూరు గ్రామంలో కొలువై ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానాన్ని ఆదివారం (నవంబర్ 22) ఉప లోకాయుక్త పి. రజని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె శ్రీ మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు ఆమెకు తీర్థప్రసాదాలు అందజేశారు.