-16.48 ఎకరాల భూమికి అంగీకార పత్రాల అందజేత.. అమరావతి అభివృద్ధికి సహకారం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
ప్రజారాజధాని అమరావతి నిర్మాణం, అభివృద్ధి కోసం తాడికొండకు చెందిన 11 మంది రైతులు స్వచ్ఛందంగా 16.48 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ కింద అందించేందుకు ముందుకొచ్చారు. ఈ మేరకు సోమవారం రైతులు భూములకు సంబంధించిన అంగీకార పత్రాలను కాంపిటెంట్ అధికారి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె. గణపతిరావుకు స్థానిక యూనిట్ కార్యాలయంలో అందజేశారు.
రైతులు భూములు ఇచ్చేందుకు అంగీకరించడంతో అమరావతి రైల్వే లైన్తో పాటు పలు అభివృద్ధి ప్రాజెక్టుల పనులకు మార్గం సుగమం కానుంది. రాజధాని నిర్మాణంలో భాగస్వాములు కావడం సంతోషంగా ఉందని రైతులు ఈ సందర్భంగా తెలిపారు.
భూములు అందించేందుకు అంగీకారం తెలిపిన రైతుల్లో మోపర్తి సాంబశివరావు (3.88 ఎకరాలు), మోపర్తి రవిశేఖర్ (1.00), మాడాల నాగమల్లేశ్వరరావు (3.80), బత్తుల శ్రీనివాసరావు (1.17), తుమ్మల ప్రశాంత్ (1.12), తుమ్మల రవికిరణ్ (1.15), తుమ్మల సత్యనారాయణ (1.60), తుమ్మల విజయలక్ష్మి (1.51), కుర్ర కోటేశ్వరరావు (0.25), కుర్ర జోగేంద్ర (0.50), కుర్ర గౌతమ్ కృష్ణ (0.50) ఉన్నారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ కోటేశ్వరరావు పాల్గొన్నారు.
