విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఎమ్మెల్యే సుజనా చౌదరి సహకారంతో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం లబ్ధిదారులకు మంజూరైన ఎల్ఓసిలను భవానిపురం లోని ఎమ్మెల్యే కార్యాలయంలో మంగళవారం ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు 49 వ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ అడ్డూరి శ్రీరామ్, కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కూటమి నాయకులతో కలిసి లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు అందజేశారు. ప్రైజర్ పేటకు చెందిన వీసపోగు విజయబాబు (45) కు రూ 4.97 లక్షలు, ఊర్మిళా నగర్ కు చెందిన మొతుకూరి ఖాసింబి (74) కు రూ 4.10 లక్షల విలువైన ఎల్ ఓ సీ ను అందజేశారు. త్వరితగతిన స్పందించి ఎల్ ఓ సీ పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరి కు బాదితుల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా బీజేపీ వైస్ ప్రెసిడెంట్ నున్న కృష్ణ, 53 వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షుడు సోంపాక చినబాబు, 40 వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు మోరబోయిన రాంబాబు, బీజేపీ నాయకులు దుర్బేసుల హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
మెరుగైన వైద్యం కోసం ఎల్ ఓ సీ పత్రాలు అందజేత
