విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
రాష్ట్ర మానవ హక్కుల కమీషన్ నిర్వహించిన క్యాంప్ కోర్టులో 15 కేసులకు పరిష్కరించామని జ్యూడిషయల్, కమీషన్ సభ్యులు దండె సుబ్రహ్మణ్యం తెలిపారు. నగరంలోని సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం రాష్ట్ర మానవ హక్కుల సంఘం జ్యూడిషయల్, కమీషన్ సభ్యులు దండె సుబ్రహ్మణ్యం, నాన్ జ్యూడిషయల్ సభ్యులు డా. గోచిపాత శ్రీనివాసరావులు మానవ హక్కుల సంఘంలో నమోదైన కేసులను విచారణ జరిపారు. ఎన్‌టిఆర్ జిల్లా, కృష్ణ, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలు, గుంటూరు, పల్నాడుకు సంబంధించిన కేసులను విచారించడం జరిగిందన్నారు. మొత్తం 49 కేసులు నమోదు కాగా వీటిలో 39 కేసులను విచారణ జరపగా వీటిలో 15 కేసులను పరిష్కరించడం జరిగిందని తెలిపారు. వీటిలో 24 కేసులను వాయిదా వేయడం జరిగిందని ఆయన వివరించారు. ఈనెల 26,27 తేదిలలో గుంటూరులో నిర్వహించిన క్యాంప్ కోర్టులో పలు కేసులను పరిష్కరించామని సభ్యులు వివరించారు. ఈనెల 30వ తేది వరకు ఎన్‌టిఆర్ జిల్లా విజయవాడలో మానవ హక్కుల కమీషన్ క్యాంప్ కోర్టు పెండిరగ్ కేసులు, కొత్త కేసులను విచారణ జరుపుతుందని జ్యూడిషయల్, కమీషన్ సభ్యులు దండె సుబ్రహ్మణ్యం తెలిపారు. క్యాంప్ కోర్టు విచారణలో కమీషన్ కార్యదర్శి సంపర వెంకటరమణ మూర్తి, నోడల్ ఆఫీసర్, విభాగాధిపతి బొగ్గరం తారక నరసింహకుమార్ ఉన్నారు.
Tags vijayawada
Check Also
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు స్పందించాలి
-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 8వ తేదీన విశాఖపట్నంలో పర్యటించిన …