మహంకాళి అమ్మవారి ఆలయానికి రూ.1.08 లక్షల విరాళం

కంఠంరాజు కొండూరు, నేటి పత్రిక ప్రజావార్త:
గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం కంఠంరాజు కొండూరులోని శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానానికి గుంటూరు వాస్తవ్యులు యం. సాంబశివరావు రూ.1,08,000 విరాళంగా అందజేశారు. శుక్రవారం ఆలయానికి విచ్చేసి అమ్మవారి సేవార్థం చెక్కు రూపంలో ఈ విరాళాన్ని అందించారు.