పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలేకు ఘన నివాళి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా భవానిపురం, ఎమ్మెల్యే సుజనా చౌదరి గారి కార్యాలయంలో ఎన్డీఏ కూటమి నేతలు పూలే చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు కూటమి నాయకులు మాట్లాడుతూ పూలే సామాజిక న్యాయం కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడారని బహుజనుల హక్కులు సమానత్వం కోసం కృషి చేశారన్నారు. సామాజిక అసమానతలను రూపుమాపడానికి బహుజన విద్యావ్యాప్తికి తన జీవితాన్నే అంకితం చేసిన గొప్ప సంఘసంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే అని కొనియాడారు. కూటమి నాయకులు షేక్ కరిముల్లా, కామ దేవరాజ్, అహ్మద్ అలీ, దాడి అప్పారావు, దేవిన హరి ప్రసాద్ తదితరులు పాల్గొని మహాత్మా జ్యోతిరావు పూలే కు ఘన నివాళులర్పించారు.