ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రకాశం జిల్లాలో రక్షణ వ్యవస్థ సముదాయం, సాగునీటి పెండింగ్ ప్రాజెక్టులు, పారిశ్రామిక సముదాయాలు, ఫిషింగ్ బెర్త్్న పూర్తిచేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది. భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు సోమువీర్రాజు ఒంగోలులో ఆదివారం మాట్లాడారు. వెనుకబడిన ప్రకాశం జిల్లాను రాయలసీమలో కలపకుండా మధ్యస్థంగా వదిలేశారని, కేంద్రం సహయాన్ని స్వీకరించకపోవడంతో జిల్లా మరింత వెనుకబాటుతనానికి గురైందన్నారు. ప్రకాశం జిల్లాకు కేంద్రం కేటాయించిన డిఫెన్స్ క్లస్టర్ను పూర్తిచేస్తే ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. కాని దీని విషయంలో చంద్రబాబు ప్రభుత్వం కాని, జగన్ ప్రభుత్వం కాని స్పందించలేదని, ఇకనైనా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ప్రకాశం జిల్లాలో కేంద్రం ఒక పారిశ్రామిక సముదాయం (నిష్క్) ఏర్పాటుకు అనుమతి ఇచ్చిందని దానిని కూడా చంద్రబాబు కాని జగన్ కాని పట్టించుకోలేదన్నారు. అసలు ఈ అంశంపై వారికి అవగాహన ఉందా అని ప్రశ్నించారు. తక్షణం నిమ్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులపై బడ్జెట్లో నిధులు కేటాయించలేదని విమర్శించారు. గోదావరి జలాలు కృష్ణానదిలో కలిస్తే 10 టీఎంసీల నీటిని ఇస్తే ప్రకాశంతో సహా మరో 3, 4 జిల్లాలు సస్యశ్యామలం అవుతాయన్నారు. మత్స్యకారులను ఆదుకునేలా జిల్లాలో ఫిషింగ్ బెర్త్ నిర్మించాలన్నారు. మోదీ ప్రధాని అయ్యాక గుజరాత్లో 24 బెర్త్లు నిర్మించారన్నారు. మన రాష్ట్రంలోని మత్స్యకారులు ఉపాధి నిమిత్తం కర్నాటక, చెన్నై, గుజరాత్లకు వెళు _న్నారని అన్నారు. మన రాష్ట్రానికి కేంద్రం నాలుగు బెర్త్లు కేటాయించిందని వాటి నిర్మాణంలో 60 శాతం నిధులు కూడా సమకూరుస్తుందని రాష్ట్రం వెంటనే తన వాటాగా 40 శాతం నిధులు కేటాయించి వాటిని నిర్మించాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు తప్పితే పెండింగ్ ప్రాజెక్టుల గురించి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఆలోచించడం లేదని ప్రశ్నించారు. జిల్లాలోని గుండ్లకమ్మ, వెలిగొండ ప్రాజెక్టులు ఎప్పుడు పూర్తిచేస్తారని ప్రశ్నించారు. జగన్, కెసీఆర్లు వివాదాస్పద అంశాలపై రాత్రిళ్లు మాట్లాడుకుని పగలు ప్రధానికి లేఖలు రాస్తున్నారని విమర్శించారు. కృష్ణానదీ జిల్లాలను కెసీఆర్ వాడేస్తుంటే జగన్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. వివాదాస్పద ప్రాజెక్టుల కోసం మూడు వేల కోట్లతో టెండర్లు పిలిచారు? ఎవరికి డబ్బులు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్, కెసిఆర్ కలసి ఏపీ ప్రజలు మోసం చేస్తున్నారని, జల వివాదాలను రాజ్యాంగ సంస్థల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ నెల 19న “నీటి వనరులు- ఆంధ్రప్రదేశ్ – భాజపా దృక్పధం’8 అనే అంశంపై విజయవాడలో సదస్సును నిర్మిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో పూర్తికాని 60 పెండింగ్ ప్రాజెక్టులపై జిల్లాల వ్యాప్తంగా ఉద్యమాలు నిర్మిస్తామన్నారు. ఇంకా ఆయన ఇలా అన్నారు. 2014 నుంచి 2021 వరకు జాతీయ రహదారుల కోసం రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం రూ.రెండు లక్షల కోట్లు కేటాయించింది. రైల్వేలకు రూ.11 వేల కోట్లు ఖర్చు చేసింది. రూ.35 వేల కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉంది. రాష్ట్రం మాత్రం తన వంతు వాటా కేటాయించలేదు. పిఎం గ్రామీణ సడక్ యోజన, నాబార్డు, నరేగా, అమృత్ నిధులతో పంచాయతీలు, గ్రామాలు, మున్సిపాలిటీల్లో రహదారులు నిర్మిస్తున్నాం. రూ.10 వేల కోట్ల నరేగా నిధులతో గ్రామాలకు రోడ్లు వేశాం. మున్సిపాలిటీలు కార్పొరేషన్లు పంచాయతీల్లో మీరే ఖర్చు చేశారో చెప్పాలి. మేం ఏం చేశామో చెబుతాం. చర్చకు సిద్ధంగా ఉన్నాం. రూ.17 వేల కోట్ల “నరేగా” నిధులతో కూలీలకు ఉపాధి కల్పన జరిగింది. కేంద్రం నుంచి నిధుల వరద వస్తే రాష్ట్రం నుంచి అప్పుల వరద వస్తుంది. స్టీల్ ప్లాంట్ అలాగే ఉంటుంది. పాల డైరీలు, షుగర్ ఫ్యాక్టరీలు అమ్మేశారు. దీనిపై చర్చ జరగాలి. వనరుల దోపిడీ, మైనింగ్ మాఫియాను అరికట్టాలి. పెట్రోలు కేంద్ర ప్రభుత్వం ఆదాయ వనరుగా భావించడం లేదు. పెట్రోల్ జీఎస్టీ పరిధిలోకి తేవాలి. మీడియా సమావేశంలో భాజపా రాష్ట్ర కార్యదర్శి, ప్రకాశం జిల్లా ఇన్ఛార్జి నాగోతు రమేష్నాయుడు, ఒంగోలు పార్లమెంటు జిల్లా అధ్యక్షులు శిరసనగండ్ల శ్రీనివాసులు, లంకా దినకర్, సీనియర్ నాయకులు దారా సాంబయ్య తదితర నాయకులు పాల్గొన్నారు.
Tags ongole
Check Also
ప్రజలు గడ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేతలు
-మనోభావాలు దెబ్బతినే విధంగా పండుగలపైనా ప్రేలాపనలు -రూ.850 కోట్లతో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …